కేటీఆర్ ప్ర‌శ్: మా నాన్న ప్ర‌జ‌ల్ని ఎందుకు క‌ల‌వాలి?

కేటీఆర్ ప్ర‌శ్: మా నాన్న ప్ర‌జ‌ల్ని ఎందుకు క‌ల‌వాలి?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ త‌న తండ్రికి బాస‌ట‌గా నిలిచారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్  ఈ సంద‌ర్భంగా తమ విధానాలు ఎలా ఉంటాయో స్ప‌ష్టంగా క్లారిటీ ఇచ్చేశారు. ఇటు జిల్లాల ఏర్పాటు, అటు ప్ర‌జ‌ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లువ‌క‌పోవ‌డం, మ‌రోవైపు ఎంఐఎంతో త‌మ మైత్రి విష‌యంలో కేటీఆర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడారు.

 ప్రజల కోరిక మేరకే సిరిసిల్ల, గద్వాల, జనగామ, ఆసిఫాబాద్‌లను జిల్లాలుగా చేయబోతున్నారని కేటీఆర్ తెలిపారు. డీకే అరుణ కోసం గద్వాలను జిల్లాగా చేయడం లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సిరిసిల్లను జిల్లా చేయాలని అక్కడి ప్రజలు కోరుకున్నందునే సీఎం కేసీఆర్‌ జిల్లాగా ప్రకటించారని తెలిపారు. జనగామ ప్రజలు కూడా జనగామను జిల్లా చేయాలని కోరుకున్నందునే జిల్లాగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించదన్నారు. కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చిన నాటి నుంచి ఆదివాసీల జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ వచ్చిందన్నారు. గిరిజనులు, ఆదివాసీల అభీష్టం మేరకు ఆసిఫాబాద్‌ను జిల్లా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఒక ప్ర‌భుత్వ భాగ‌స్వామ్య‌ప‌క్ష‌మైన ఎంఐఎం గురించి మాట్లాడుతూ ఎంఐఎం మ‌త‌త‌త్వ పార్టీ కాద‌ని కేటీఆర్ తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తోంది కాబ‌ట్టే మ‌ళ్లీ గెలుస్తోంద‌ని తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ ఎందుకు నిర్వహించడం లేదని విలేకరులు ప్రశ్నించగా ప్రజా దర్బార్‌ పెట్టడానికి మాది రాజరికపు పాలన కాదని కేటీఆర్ సమాధానమిచ్చారు. ప్రజలకు సేవలందించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఉన్నారని, అలాంటప్పుడు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. న‌యీం ఎన్‌కౌంట‌ర్ పై సీబీఐ విచార‌ణ అవ‌స‌రం లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.  ఎంపీ మల్లారెడ్డి కాలేజిని కూల్చడానికి జిహెచ్‌ఎంసి సిబ్బంది వెళ్లగా బిఆర్‌ఎస్ పథకం కింద డబ్బులు చెల్లించడంతో ఆగిపోయినట్టు వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు