కోడెల బ్యాడ్ టైం కొన‌సాగుతోంది

కోడెల బ్యాడ్ టైం కొన‌సాగుతోంది

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు బ్యాడ్ టైం ఇంకా కొన‌సాగుతోంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు భిన్నంగా 2014 ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చుచేసిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సరావుపేటకు చెందిన న్యాయవాది అలెగ్జాండర్‌ సుధాకర్‌ రాష్ట్రపతికి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్య తీసుకోవాలని రాష్ట్రపతి భవన్‌ నుంచి కేంద్ర హోంశాఖకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో హోం శాఖ నుంచి భారత ఎన్నికల కమిషనర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు వచ్చాయి. ఏ చర్య తీసుకున్నదీ రాష్ట్రపతి కార్యాలయానికి తెలియజేయాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అనంతరం ఆయన రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జూన్‌ 19న ఒక టీవీ ఛానల్‌లో ముఖాముఖి ఇంటర్వ్యూ ఇస్తూ 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించిన తాను నర్సరావుపేట నుంచి పోటీ చేసి కేవలం రూ.30 వేలు ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచానని, 2014 ఎన్నికల్లో మాత్రం సత్తెనపల్లిలో తనకు రూ.11.50 కోట్లు ఖర్చు అయిందని కోడెల తెలిపారని అలెగ్జాండర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని, ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి విజయం సాధించడంతో నిబంధనల ప్రకారం ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. దీంతో దీనిపై విచారణ ప్రారంభమైంది. స్వ‌యంగా కోడెల త‌న‌కు తానుగా అనూహ్య‌మైన చిక్కుల్లో ప‌డ్డార‌ని ప‌లువురు అంటున్నారు.

ActressMore »

  • Shilpi Sharma Latest StillsShilpi Sharma Latest Stills
  • Sushma Raj Latest StillsSushma Raj Latest Stills
  • Rasi Khanna Shines In BlackRasi Khanna Shines In Black
  • Richa Panai Latest StillsRicha Panai Latest Stills
  • Premam Heroine Anupama ParameshwaranPremam Heroine Anupama Parameshwaran
  • Vaibhavi Joshi Spicy StillsVaibhavi Joshi Spicy Stills

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English