పాక్ మనపై అణుబాంబు వేయాలనుకుంటుందా?

పాక్ మనపై అణుబాంబు వేయాలనుకుంటుందా?

పాక్ తో పూర్తి స్థాయి యుద్ధం వస్తుందో లేదో అప్పుడే చెప్పలేం కానీ.. యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ, ఆందోళన అంతటా ఉంది. పాక్ భూభాగంలోకి మన సేనలు చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల భరతం పట్టిన నేపథ్యంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో పాక్ కూడా మన సేనల ప్రవేశాన్ని ధ్రువీకరించాయి.

భారత సైన్యం దాడులను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఖండించారు.  పరిస్థితులు తీవ్రమయ్యేటప్పటికి ఆయన శాంతి మంత్రం పఠిస్తున్నట్లు నటన మొదలుపెట్టారు. తాము శాంతి కావాలని కోరుకుంటున్నామని.. అది తమ బలహీనత అనుకోవద్దని అన్నారు.  అదే సమయంలో తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు.

పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ కూడా దీనిపై స్పందించి.. భారత సైన్యం నియంత్రణ రేఖను ఉల్లంఘించి తమ భూభాగంలోకి వచ్చిందని చెప్పారు.  తమ సైనికులు ఇద్దరు మరణించారని, తొమ్మిది మందికి గాయాలయ్యాయని ఆరోపించారు.  అక్కడితో ఆగని ఆయన అణ్వస్త్రాల ప్రస్తావన తెచ్చారు. తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని..  యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అన్నారు. మా దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఆటబొమ్మలేం కావని... వాటిని తమ రక్షణ కోసం ఉపయోగిస్తామని చెబుతూ మనల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో నిజంగా యుద్దమంటూ వస్తే పాక్ అణ్వాయుధాల ఒప్పందాలను పక్కన పెట్టి మనపై అణు దాడి చేసే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు