ముందు మీ నిధులు ఖర్చు చేయండయ్యా..

ముందు మీ నిధులు ఖర్చు చేయండయ్యా..

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రుల‌కు భారీ షాకే ఇచ్చారు. ఆప‌ద‌లో ఉన్న రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ముందుగా రాష్ట్రాల వ‌ద్ద నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌కుండా కేంద్రం నుంచి నిధుల కోసం ఎదురు చూస్తే ఎలాగంటూ వెంక‌య్య చేసిన వ్యాఖ్య‌లు ఇద్ద‌రు చంద్రుల‌కు సూటిగానే తాకాయి. సొంత నిధుల‌ను అట్టిపెట్టుకుని ఎక్క‌డి నుంచో వ‌స్తాయ‌ని భావించే నిధుల కోసం ఎదురుచూడటం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మంటూ వెంక‌య్య చేసిన వ్యాఖ్య‌లు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను కాస్తంత ఆలోచ‌న‌లో ప‌డేశాయ‌నే చెప్పాలి.

వివ‌రాల్లోకెళితే... వారం, ప‌ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా రెండు రాష్ట్రాల్లో భారీ న‌ష్టం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ రాజధాని హైద‌రాబాదు అత‌లాకుత‌లం కాగా... ఆ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో పెద్ద న‌ష్ట‌మే సంభ‌వించింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని మానేరు డ్యాంకు ఏకంగా గండి ప‌డిపోగా... స‌ద‌రు ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టునే ప్ర‌భుత్వం ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. ఇక ఏపీలోని గుంటూరు, క‌ర్నూలు జిల్లాల్లో వేలాది ఎక‌రాల్లో పంట‌లు నీట మునిగాయి. ప‌లు జిల్లాల మ‌ధ్య  రాక‌పోక‌లు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వర్ష బీభ‌త్సాన్ని అంచ‌నా వేసే ప‌నిలో ప‌డ్డారు. అదే స‌మ‌యంలో కేంద్రం ఆదుకోవాలంటూ వారిద్ద‌రూ మొర‌పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే గుంటూరు జిల్లాలో వ‌ర్షం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. తాజాగా నేటి ఉద‌యం ఆయ‌న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి రాధా మోహ‌న్ సింగ్ ల‌తో వెంక‌య్య  వ‌రుస భేటీలు నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన వ‌ర్ష బీభ‌త్సాన్ని ఆయ‌న వారికి వివ‌రించారు. పెను న‌ష్టంతో విల‌విల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల‌కు తక్ష‌ణ‌మే ఆప‌న్న హ‌స్తం అందించాల‌ని ఆయ‌న త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌ను కోరారు.

ఆ త‌ర్వాత ఆయ‌న అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సీఎంల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రాల వ‌ద్ద ఉన్న విప‌త్తు నిధిని ముందుగా వినియోగించాల‌ని సూచించిన ఆయ‌న‌... కేంద్రం కూడా త‌న వంతు సాయాన్ని అందిస్తుంద‌ని తెలిపారు. ముందుగా మీ వ‌ద్ద ఉన్న నిధుల‌ను ఖర్చు చేయ‌కుండా కేంద్రం నుంచి వ‌చ్చే సాయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఎలాగంటూ ఆయ‌న కేసీఆర్, చంద్ర‌బాబుల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు