ఇక ఛాన్సే లేదు.. వెళ్ళాల్సిందే

ఇక ఛాన్సే లేదు.. వెళ్ళాల్సిందే

మున్నాభాయ్‌ సంజయ్‌దత్‌కు ఏ విధంగా చూసుకున్నా రిలీఫ్‌ అయితే రావడంలేదు. 1993 ముంబయ్‌ బాంబు పేలుళ్ళ సంఘటనకు సంబంధించి కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, సంజయ్‌ ఇక రివ్యూ పిటీషన్‌ను, ఈయనగారి నిర్మాతలు గడువు పొడిగించాలని మరో పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే సంజు పిటీషన్‌ను చాలా రోజుల క్రితమే తిరస్కరించిన కోర్టు, ఇవాళ నిర్మాతల పిటీషన్‌ను కొట్టేసింది.

సో, ఎట్టి పరిస్థితుల్లో సంజయ్‌ దత్‌ మే 16న కోర్టులో లొంగిపోవాల్సిందే. ఇంకెటువంటి పిటీషన్‌ కూడా మన్నాభాయ్‌ను జైలుకు వెళ్ళకుండా ఆపలేదు. ప్రొడ్యూసర్లు ఏడ్చినా, అభిమానులు గోలపెట్టినా, 93లో సంజయ్‌ ఆయుధాలు కలిగియుండడం తదితర పరిణామాలు కోర్టును సీరియస్‌గా కలచివేశాయి. అందుకే మనోడికి ఏ క్షణాన కోర్టు ఒక్క రోజు కూడా శిక్ష తగ్గించలేదు. మనోడు మొత్తం మూడు సంవత్సరాల ఖైదీ జీవితాన్ని గడిపితేకాని బయటకు వచ్చే ఛాన్స్‌ ఉండదు. ఒకవేళ ప్రవర్తన నచ్చితే ఆఖరు సంవత్సరంలో మనోడికి ఏ స్వాతంత్య్రదినోత్సవం నాడో క్షమాభిక్ష పెట్టొచ్చు. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు