ఏపీలో అగ్గిరాజేస్తున్న తెలంగాణ ప్రొఫెసర్‌

ఏపీలో అగ్గిరాజేస్తున్న తెలంగాణ ప్రొఫెసర్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తెలంగాణ నాయకులు గళం విప్పుతున్నారు.హైదరాబాద్‌లోని ఉస్మానియా న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌ గాలి వినోద్‌కుమార్‌ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ప్రత్యేక హోదా కోసం గొంతు విప్పారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బి.కొత్తకోటలోని స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 'బహుజన పొలికేక' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకపోతే.. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భాజపాకు బానిసగా మారిపోవడంతో కేంద్రం ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని గాలి వినోద్‌ కుమాఱ్‌ ఆరోపించారు. అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టిన చంద్రబాబు రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.  2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టడానికి బహుజనులు సమైక్యశక్తిగా చేతులు కలపి ముందుకు సాగాలని వినోద్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే దళితుడు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపడుతారని కేసీఆర్‌ మాట ఇచ్చి తప్పారని ధ్వజమెత్తారు. బహుజనులకు అధికారమే లక్ష్యంగా సాగుతున్న తమ పోరాటానికి పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇవ్వాలని కోరారు. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లక్ష ఎకరాల భూమిని పేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. అణగారిన వర్గాలపై దాడులను ఎప్పటికప్పుడు ప్రతిఘటించాలని వినోద్‌ కుమార్‌ కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు