పాకిస్తాన్‌కు గంటా చేసిన సవాల్‌ విన్నారా?

పాకిస్తాన్‌కు గంటా చేసిన సవాల్‌ విన్నారా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ వనరుల శాఖామాత్యులు గంటా శ్రీనివాసరావు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య పెరుగుతున్న దూరంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌ రోడ్‌ని వ్కెఎంసీఏ వద్ద అమర జవాన్లకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు వీర జవాన్ల ఫోటోలతో కూడిన బ్యానర్‌పై సంతకాల సేకరణ బ్యానర్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మంత్రి గంటా ప్రసంగిస్తూ సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పాక్‌ తీరుపై విరుచుకుపడ్డారు.

పాకిస్థాన్‌ను అంతమొందించడం మన దేశానికి పెద్ద విషయం కాదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. భారతదేశం బలంతో పోల్చితే అన్ని విషయాల్లోనూ పాకిస్థాన్‌ తీసికట్టేనన్నారు. అయితే మనదేశం సంయమనం పాటిస్తుంటే ఎప్పటికప్పుడు పాక్‌ దారుణాలకు ఒడిగడుతోందని గంటా మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉందని...సరైన సమయం వచ్చినపుడు సరైన రీతిలో స్పందిస్తుందని గంటా తెలిపారు. ఇప్పటికే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఒంటరిచేసిందని చెప్పారు. త్వరలోనే పాక్‌కు ధీటైన జవాబు ఇస్తుందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు