వ‌చ్చే నెలంతా పండ‌గేనంట‌

వ‌చ్చే నెలంతా పండ‌గేనంట‌

మ‌రో ఐదు రోజుల త‌ర్వాత కొత్త నెల వ‌చ్చేస్తోంది. అయితే.. ఈ నెల‌లో విశేషాలే విశేసాల‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రెండు పెద్ద పండుగ‌లు ఒకే నెల‌లో రావ‌టం కాస్తంత అరుదు. అంతేకాదు.. అలాంటి విశేషాలు రానున్న అక్టోబ‌రులో చాలానే ఉన్నాయి మ‌రి. ఈ నెల‌లో వ‌చ్చే విశేసాల లెక్క చూస్తే వావ్ అనాల్సిందే. ఒకే నెల‌లో ఐదు శ‌నివారాలు.. ఐదు ఆదివారాలు.. ఐదు సోమ‌వారాలు రావ‌టం ఒక విశేషంగా చెప్పాలి.

శనివారాలు 1..8..15..22.. 29, ఆదివారాలు 2..9..16..23..30 తేదీల్లో రాగా.. సోమవారాలు 3..10..17..24..31 తేదీల్లో రానున్నాయి. ఇక పండుగలు చూస్తే కొదవలేదనాల్సిందే. ఒకటో తేదీ నుంచే నవరాత్రులు మొదలుకానున్నాయి. ఏడో తేదీ సరస్వతీ పూజ.. 8న బతుకమ్మ.. 11న దసరా.. 12న పీర్ల పండుగ.. 18న అట్లతద్దె కాగా.. 28నధనత్రయోదశి పర్వదినం. ఇలా నెల మొత్తం పండుగలే పండుగలుగా ఉన్న అక్టోబరు చివరన (30న) దీపావళితో  నెల పూర్తి కానుంది.

ఇక.. పిల్లలకు ఈ నెల మొత్తం సెలవులే సెలవులుగా చెప్పాలి. మొదట్లో అయితే అక్టోబర్ 15 వరకు దసరా సెలవులు అనుకున్నా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని రోజులు కుదించనున్నారు. ఇది మినహాయిస్తే.. పండుగలతో పాటు.. ఐదు ఆదివారాలు.. శనివారాలతో పండగే పండుగ. కాకపోతే.. ఒకే ఒక్క లోటేమిటంటే.. దీపావళి పండుగ ఆదివారం రావటం. అంతకు మినహా మిగిలినదంతా ఎంజాయే.. ఎంజాయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English