పాకిస్తాన్‌ పావురం కలకలం

పాకిస్తాన్‌  పావురం  కలకలం

పంజాబ్‌ హోషియర్‌పూర్‌లోని మొట్లా గ్రామంలో ఓ పావురం టెన్షన్లు రాజేసింది. కేవలం ఓ పావురానికి ఇంతగా భయపడిపోవడం ఏంటని అనుకోకండి. ఎందుకంటే సదరు కపోతం రెక్కలపై ఉర్దూ స్టాంప్‌తో పాటూ పదకొండు అక్షరాలున్న ఓ కోడ్‌ కూడా ఉంది. ఈ పాపురం పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. యూరీ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో కోడ్ భాషలో ఉన్న పావురం సరిహద్దు ప్రాంతాల్లోకి రావడం కలకలం సృష్టించింది.

కోడ్ లాంగ్వేజ్‌ ఉన్న ఈ పావురం మొట్లాలోని నరేష్ కుమార్ ఇంటికి వచ్చింది. దాని రెక్కలపై ఉర్దూ భాషలో ఏదో రాసి ఉండడంతో నరేష్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పావురాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులకు దానిని అప్పగించారు. ఇలాంటి ఘటనే గతేడాది ఇండో-పాక్ సరిహద్దుల్లోని పఠాన్‌కోట్ జిల్లాలోనూ సంభవించింది. ఇదిలాఉంటే, ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న కపోతంపై ఉన్న కోడ్ లాంగ్వేజ్‌ను ఛేధించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. పావురం శరీరంలో ఏమైనా ఉందనే అనుమానంతో దానిని ఎక్స్‌రేలు కూడా తీశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు