పాడు రోజులు: నచ్చినట్లు సెక్స్‌ చేసే రోబోలట

పాడు రోజులు: నచ్చినట్లు సెక్స్‌ చేసే రోబోలట

నిజంగా కొన్ని వార్తలు చూస్తే.. ముందే పుట్టేశాం. కాస్త లేటుగా పుట్టి ఉంటే పరిస్థితి ఏమిటో? అన్న భయం కలగటం ఖాయం. తాజాగా మేం చెప్పబోయేది కూడా అలాంటిదే. సృష్టిలో అతిముఖ్యమైంది.. మానవ నాగరికతకు మూలంగా నిలిచే సృష్టి కార్యం ఎక్కడి వరకూ వెళుతుందన్న విషయం తెలిసిన వెంటనే గుండె గుభేల్‌ అనిపించటం ఖాయం. ఎందుకంటే.. ప్రకృతి సిద్ధంగా మగ..ఆడ కలిసి చేసే సెక్స్‌.. కాలక్రమంలో మగ..మగ.. ఆడ.. ఆడ చేసేయటం తెలిసిందే. ఈ మార్పును ఇప్పటికి జీర్ణించుకోనివారు కోట్లకొద్దీ ఉంటారు.

దీనికే ఆగమాగమయ్యే వారికి.. ఇప్పుడు చెప్పే ప్యూచర్‌ ముచ్చట్లు వింటే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ కావటం ఖాయం. రానున్న రోజుల్లో ప్రోగ్రాం చేసిన రోబోలు రాబోతున్నాయట. వీటి పనేమిటంటే.. తమను కొనుక్కున్న వారి అభిరుచులకు తగ్గట్లుగా సెక్స్‌ చేయటమేనట. బెడ్రూమ్‌లో ఉండే వారికి తగ్గట్లుగా ఈ రోబోలు సెక్స్‌ సుఖాన్ని అందిస్తాయట. సురక్షితమైన క్రియేటివ్‌ సెక్స్‌ చేయటానికి ఈ రోబోలు అనువుగా ఉంటాయని చెబుతున్నా.. వ్యవహారం అక్కడితో ఆగదని.. అంతకు మించి అంటూ యంత్రంతో మనిషికి కొత్త రకం అనుబంధం ఏర్పడుతుందని.. ఇదేమాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ తరహా రోబోలు మార్కెట్లోకి వచ్చే కాలం ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు కిన్‌ వుడ్‌ కాలేజీకి చెందిన రోబోటిక్‌ నిపుణులు. ఈ దశ తర్వాత మనుషులకు.. రోబోలకు మధ్య సంబందాల్లో అనూహ్యమైన మార్పులు రావటమే కాదు.. రోబోలతో సెక్స్‌ అన్నది ఒక వ్యసనంగా మారిపోతుందని చెబుతున్నారు. ఇది జరగటం ఖాయమని.. ఆ తర్వాత మానవ సంబందాల్లో తీవ్రమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు ఎలా అయితే ఇంట్లో కుటుంబసభ్యుల్ని కొత్త వారికి పరిచయం చేస్తామో.. ఈ సెక్స్‌ రోబో ను కూడా అదే విధంగా పరిచయం చేసే రోజులు కూడా వచ్చేస్తాయట. రోబోలు చేసే సెక్స్‌ తో దాని మైకంలో పడిపోయిన మనిషి కారణంగా మానవ సంబంధాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు చెబుతున్న మాటలన్నీ నిజమే అయితే.. మనిషి అస్థిత్వానికే ముప్పు వాటిల్లటం ఖాయమంటున్నారు. ఇప్పుడు చెప్పండి.. రాబోయే రోజుల్ని పాడు రోజులు అనాలా? వద్దా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు