వైకాపా(టీడీపీ) ఎమ్మెల్యే కొడుకుపై రేప్‌ కేసు నమోదు

వైకాపా(టీడీపీ) ఎమ్మెల్యే కొడుకుపై రేప్‌ కేసు నమోదు

ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల పుత్రరత్నాలు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఏం చేసినా ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారో ఏమో.. తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ.. సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రి రావెల కిశోర్‌ బాబు పుత్రరత్నం.. హైదరాబాద్‌లో ఓ మహిళ చేయిని పట్టుకుని రెండు రోజులు ఊచలు కూడా లెక్కపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత అది సెటిల్‌మెంట్‌ అయిపోయింది లేండి! ఆ తర్వాత మరో కుమారుడు గుంటూరులోని ఓ మహిళా హాస్టల్లోకి అర్ధరాత్రి ప్రవేశించి అడ్డంగా దొరికిపోయాడు. తర్వాత ఇది కూడా సైలెంట్‌ అయ్యింది.

ఇక, ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైకాపా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పుత్రరత్నం కూడా చేరిపోయాడు! 2014 ఎన్నికల్లో వరుపుల వైకాపా తరఫున గెలిచారు. తర్వాత సీఎం చంద్రబాబు ఆకర్ష్‌ దెబ్బకి సైకిల్‌ ఎక్కేశారు. వరుపుల సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సర్పవరం పోలీసులు రాజాబాబుపై  క్రైం నెంబర్‌ 323/16 కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.దీంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇదిలావుంటే, ఎప్పటిలాగే.. వరుపుల సుబ్బారావు అండ్‌ కో పొలిటికల్‌ నేతలు .. ఈ కేసును మసిపూసి మారేడు చేసేందుకు అప్పడే రింగ్‌లోకి దిగిపోయారని గిరిజన యువతి తరఫువారు ఆరోపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు