క్రేజీ: హైద‌రాబాద్‌ బ‌స్సుల్లో ఫ్రీ వైఫై

క్రేజీ: హైద‌రాబాద్‌ బ‌స్సుల్లో ఫ్రీ వైఫై

హైదరాబాద్ నగరంలో నిత్యం వ‌ర్షాలు, ట్రాఫిక్ తాలుకు త‌ల‌నొప్పులు ప‌క్క‌న‌పెడితే ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న ప‌లువురిని ఆక‌ర్షిస్తోంది. అదే ఫ్రీ వైఫై. అది కూడా బ‌స్సుల్లో. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ఈ కొత్త పథకానికి శ్రీ‌కారం చుట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. 115 ఏసీ, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తాజాగా మీడియాకు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం కొన్ని బ‌స్సుల్లోనే ప్రారంభించిన ఈ సేవ‌లు రాబోయే వారం రోజుల్లోనే ఈ వైఫై సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయ‌న తెలిపారు. ప్రయాణికులు మొదటి 30 నిమిషాలు ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌ర్వాత కూడా వైఫై యూజ్ చేసుకునే వాళ్లు సాధారణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రూరల్‌ ఇండియా సంస్థ భాగ‌స్వామ్యంతో ఈ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నట్లు ఈడీ తెలిపారు. చూస్తుంటే టెక్నాల‌జీలో తెలంగాణ ముందుకు పోతున్న‌ట్లే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.