దేశంలో లక్ష కోట్ల ఆస్తి ఉన్నోళ్లు ఎంతమందంటే..

దేశంలో లక్ష కోట్ల ఆస్తి ఉన్నోళ్లు ఎంతమందంటే..

దేశంలో అత్యధిక సంపన్నుడు ఎవరన్న వెంటనే.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేరును చెప్పేశారు. అయితే.. ఆయన ఆస్తి ఎంతంటే మాత్రం వెంటనే సమాధానం చెప్పలేరు. గడిచిన కొన్నేళ్లుగా దేశంలో అత్యంత సంపన్నుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఆస్తి విలువను తాజాగా ఫోర్బ్‌ ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏడాది వ్యవధిలో ముకేశ్‌ అంబానీ ఆస్తి భారీగా పెరగటం గమనారం.

ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ.1.52 లక్షలుగా ఫోర్బ్‌ ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయానికి ముకేశ్‌ ఆస్తి కేవలం రూ.1.26 లక్షల కోట్లు మాత్రమే. అయితే.. రిలయన్స్‌ షేరు ధర దూసుకెళుతున్న నేపథ్యంలో ఆయన ఆస్తి ఏకంగా రూ.26వేల కోట్లకు పెరిగింది. ముకేశ్‌ అంబానీ తర్వాత అత్యధిక సంపద కలిగిన పారిశ్రామికవేత్తగా ఫార్మా దిగ్గజం దిలీప్‌ సంఘ్వీ నిలిచారు. ఆయన సంపద మొత్తం రూ.1.13లక్షల కోట్లుగా తేల్చారు.

ఇక అత్యంత సంపద కలిగి వ్యక్తుల్లో ఒకరిగా నిలిచే విప్రో అధిపతి ప్రేమ్‌ జీ ఈసారి తన స్థానాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టుకున్నారు. మూడో స్థానంలో హిందుజా సోదరులు నిలిచారు.  ఇక టాప్‌ టెన్‌ కుబేరుల్లో నలుగురు మాత్రమే లక్ష కోట్ల రూపాయిల మార్క్‌ ను దాటటం గమనారం. తాజాగా ఫోర్బ్‌ ప్రకటించిన టాప్‌ టెన్‌ కుబేరుల్ని చూస్తే..

1.  ముకేశ్‌ అంబానీ (రూ.1.52లక్షల కోట్లు)
2.   దిలీప్‌ సంఘ్వీ   (రూ.1.13 లక్షల కోట్లు)
3.   హిందూజా సోదరులు (రూ.1.02లక్షల కోట్లు)
4.   అజీం ప్రేమ్‌ జీ (రూ.లక్ష కోట్లు)
5.   పల్లోంజీ మిస్త్రీ (రూ.93వేల కోట్లు)
6.   లక్ష్మీ మిట్టల్‌ (రూ.84వేల కోట్లు)
7.    గోద్రెజ్‌ కుటుంబం (రూ.83వేల కోట్లు)
8.    శివనాడార్‌ (రూ.76వేల కోట్లు)
9.    కుమార్‌ బిర్లా (రూ.59వేల కోట్లు)
10.   సైరస్‌ పూనావాలా (రూ.57 వేల కోట్లు)

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు