జగన్ పై సిబిఐ గన్

జగన్ పై సిబిఐ గన్

జగన్ పై సిబిఐ గన్ మళ్లీ ఎక్కుపెట్టింది, ఇప్పటికిప్పుడు సిబిఐ తీరులో మార్పెలా వచ్చిందంటే అది జగన్ కోరి చేసుకున్నదే. ఆ మధ్య తెరవెనుక వ్యవహారాలు నడిచి వ్వవహారం కాస్త నెమ్మదించింది. కానీ సమైక్య ఉద్యమంతో స్టాండ్ మారడంతో మళ్లీ పరిస్థితి తిరుగబడింది. ధర్మానకు కోర్టులో ఊరట దొరికాక  హమ్మయ్య అనుకుంటే, సమైక్యం కోసం రాజీనామా చేయగానే మళ్లీ కేసు బిగుసుకోవడం ప్రారంభమైంది.

అంతలోనే మంత్రి ధర్మానకు నోటీసులు జారీ అయ్యాయి, మరో మంత్రి గీతారెడ్డిని సిబిఐ ఉచ్చులోకి లాగింది. ఇదేంటి అంతలోనే ఎంత తేడా, దీనికి కారణమేంటయా అని ఆలోచించడం అందరివంతయింది. అంటే అందరినోట వినిపిస్తున్న మాట జగన్ జైల్లో ఆమరణ దీక్ష చేయడం, దానికి జాతీయ మీడియా కూడా ప్రాధాన్యం ఇచ్చి కథనాలు ప్రసారం చేయడంతో అది దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పై ప్రభావం చూపెట్టడం అంటున్నారు.

దీంతో జగన్ ను దారిలోకి తెచ్చుకోవడానికే సోనియా సిబిఐని  మళ్లీ  ప్రయోగిస్తోందట. ఇందులో నిజముందో లేదో తెలియదు కాని జగన్ దీక్ష మొదలుకావడం, అలా జగన్ కేసులు ముందుకు ఉరకడం మొదలుకావడాన్ని బట్టి చూస్తే మాత్రం అనుమానాలు కలగడం సహజం అంటున్నారు. నిజానికి సమైక్య నినాదం వినిపించడం ప్రారంభించిన జగన్ అండ్ కో, ఇప్పుడు చాలా క్లారిటీగా సమన్యాయం అన్న కొత్త నినాదం అందుకున్నారు.  దీని వెనుక ఈ సిబిఐ వ్యవహారాలు వున్నాయని అంటున్నారు. సమైక్య, సమన్యాయ ఉద్యమం అందుకున్న తరువాత జగన్ కు పెరిగిన  పాపులారిటీని, ఎన్నికల విజయావకాశాలను విజయమ్మ బృందం, ఢిల్లీలో వివరించి, ఈ బలం అంతా భవిష్యత్ లో కాంగ్రెస్ కు పనికొచ్చేదే అని చెప్పుకు వచ్చినట్లు వదంతులు వినవస్తున్నాయి.  వారి బలం పెంచుకుంటూ, తమ బలం తగ్గిస్తామంటే, సోనియా ఊరుకుంటారా? అందుకేనేమో సిబిఐ బుసలు కొడుతొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు