తెలంగాణ తీర్మానం చేసెయ్యొచ్చుగా?

తెలంగాణ తీర్మానం చేసెయ్యొచ్చుగా?

తెలంగాణ కోసం మహానాడులో తీర్మానం చేయవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉంది. గతంలోనే తెలంగాణపై తీర్మానం చేశామని నామా స్పష్టం చేశారు.

ఇప్పుడు తెలంగాణ తీర్మానం చేయడమంటే మళ్లీ వెనక్కి పోవడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు కానీ, తెలంగాణ గురించి మహానాడులో తీర్మానం చేస్తేనే తెలంగాణలో తమ పార్టీకి మనుగడ ఉంటుందని కొందరు తెలంగాణ ప్రాంత తెలుగు తమ్ముళ్ళ అభిప్రాయం. నామా నాగేశ్వరరావు ఎందుకు అలా అన్నారో తెలియాల్సి ఉన్నది. మహానాడు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్న టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మహానాడులో తెలంగాణ గురించి తీర్మానం చేస్తామని చెప్పగా, నామా ఇలా అనడం తెలుగు తమ్ముళ్ళను అయోమయానికి గురిచేసింది.

తెలంగాణ ప్రాంత నేతలు నామా వ్యాఖ్యలపై ఆందోళన చెందుతుండగా, సీమాంథ్ర తెలుగుదేశం నేతలు సంతోషపడుతున్నారు. ఏదేమైనా మళ్లీ తెలంగాణ తీర్మానంపై చర్చ పెట్టి కొత్త తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుగా నామా నాగేశ్వరరావు మాటలను బట్టి అర్థమవుతున్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు