ఏపీ నేతలపై కర్ణాటక బీజేపీ నేతల ఫైర్‌

ఏపీ నేతలపై కర్ణాటక బీజేపీ నేతల ఫైర్‌

కర్ణాటక సీఎస్‌ గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రత్నప్రభను నియమించకుండా కేంద్రంలో పాఠశాల విద్య, అక్షరాస్యత కార్యక్రమ సంచాలకుడిగా ఉన్న సుభాష్‌ చంద్ర కుంతియాను నియమించబోతుండడం వివాదాలకు దారితీస్తోంది. రత్నప్రభను సీఎస్‌ కాకుండా అడ్డుకోవడం వెనుక ఏపీ నేతల హస్తం ఉందని కర్ణాటక బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ నేతలు, కర్ణాటక కాంగ్రెస్‌ కలిసి దళిత అధికారి అయిన రత్నప్రభను అడ్డుకుంటున్నారని కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప ఆరోపణలు చేశారు.

కాగా రత్నప్రభకు వ్యతిరేకంగా కేంద్రానికి ఏపీ టీడీపీ నేతలు లేఖలు రాసినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ నేపథ్యంలోనే కర్ణాటక సీఎం కూడా ఆమెను కాదని కుంతియాను సీఎస్‌ గా తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే కర్ణాటక బీజేపీ రత్నప్రభకు మద్దతు పలుకుతోంది. కుంతియా పట్ల వారికి వ్యతిరేకత లేకపోయినా ఆయనకు కాంగ్రెస్‌ మూలాలున్నట్లు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన కుంతియా ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు.

అయితే.. రత్నప్రభకు జగన్‌ కేసుల్లో సంబంధం ఉండడంతో ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు ఆమెను కర్ణాటక సీఎస్‌ కాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ బీజేపీ, టీడీపీ నేతలపై కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప కేంద్రానికి కంప్లయింటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు