అతడూ కింగ్‌ఫిషర్‌లానే ఎగిరిపోయాడు

అతడూ కింగ్‌ఫిషర్‌లానే ఎగిరిపోయాడు

విజయ్ మాల్యా..రూ.వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన బిజినెస్ టైకూన్. ఫారిన్ కంట్రీలో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉండడం బాధగానే ఉంది. భారత్‌కు రావాలని ఉందంటూ కొన్నిరోజుల క్రితమే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తాజాగా ఇతగాడిపై సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు ఎస్.ధర్మాధికారి, బీపీ కోలాబావాలాలు "మాల్యా తన కంపెనీకి తగ్గ పేరే (కింగ్‌ఫిషర్‌) పెట్టుకున్నాడు. కింగ్‌ఫిషర్‌ పిట్టలాగే విదేశాలకు ఎగిరిపోయాడు" అని వ్యాఖ్యానించారు.

"అతడు తన వ్యాపార సామ్రాజ్యానికి 'కింగ్‌ఫిషర్' పేరే ఎందుకు పెట్టుకున్నాడో ఎవరికైనా తెలుసా? చరిత్రలో ఇంతగా తగిన పేరును తమ కంపెనీలకు ఎవరూ పెట్టుకుని ఉండరు. ఎందుకంటే కింగ్‌ఫిషర్ ఓ పక్షి. అది ఎక్కడికైనా ఎగిరిపోగలదు. దానికి సరిహద్దులు లేవు. ఏ హద్దులూ దాన్ని నిలువరించలేదు. అలాగే అతడినీ ఎవరూ అడ్డుకోలేకపోయారు" అని జస్టిస్ ధర్మాధికారి విజయ్‌ మాల్యాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, కోర్టులో పిటిషన్ వేసిన సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు మాల్యా రూ.532కోట్లు బాకీపడ్డాడు. ఈ అప్పు వసూలుకు అతడికి చెందిన ఓ ప్రైవేట్ విమానాన్ని వేలం వేసేందుకు అనుమతి కోరుతూ సర్వీస్ టాక్స్ అధికారులు కోర్టును ఆశ్రయించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు