కేటీఆర్‌తో దానం సమావేశం: విషయం వేరేనట!

కేటీఆర్‌తో దానం సమావేశం: విషయం వేరేనట!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమారుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్‌ కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సచివాలయంలో మంత్రితో నాగేందర్‌ భేటీ అయ్యారు. కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు దానం దూరంగా ఉంటూ వస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో దానం నాగేందర్‌ చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో అది వాయిదా పడింది.

ఈ పరిణామాలు జరిగిన దాదాపు ఏడాది అనంతరం కేటీఆర్‌ సచివాలయం వేదికగా దానం నాగేందర్‌ కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రిని కలిసిన అనంతరం మాట్లాడుతూ తన భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేదని నాగేందర్‌ అన్నారు. వ్యక్తిగత పనులపైనే తాను కేటీఆర్‌ను కలుసుకున్నానని చెప్పారు. కాగా తన సోదరుని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశంపై  నేరుగా కేటీఆర్‌ను కలుసుకుని దానం నాగేందర్‌ మాట్లాడారని అనధికారవర్గాల కథనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు