టెక్ కంట్రీకి 'వర్జిన్' వర్రీ

టెక్ కంట్రీకి 'వర్జిన్' వర్రీ

శాస్త్రసాంకేతిక రంగంలో జపాన్ అగ్రగామి. ఎలాంటి సమస్యనైనా సాల్వ్‌ చేసే పరిజ్ఞానం తమ వద్ద ఉందని ఆదేశం గొప్పలు పోతుంటుంది. అయితే.. ఓ ప్రాబ్లమ్‌కు మాత్రం టెక్ కంట్రీ వద్ద ఫార్ములా లేదు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలీక ఆ దేశం సతమతమైపోతోంది. ఇంతకీ ఆ ట్రబుల్ ఏంటట? అనేగా మీ సందేహం. అక్కడికే వచ్చేస్తున్నాం. జపాన్‌ జనాలు పెళ్లంటే మొహం చాటేస్తున్నారు. తమ ప్రజలను పెళ్లిళ్లకు ఎలా ఒప్పించాలో తెలీక ఆ దేశం తలపట్టుకుంది.

టెక్నాలజీలో కింగ్ అయినా జపాన్‌కు జనాభాతోనే సమస్య. ప్రపంచంలో అత్యధిక వయోజకులున్న దేశం ఇదే. కొత్త జనరేషన్ లేదు. నెక్స్ట్ జెన్ రావాలంటే ప్రజలు పిల్లల్ని కనాలి. కానీ యూత్‌ వివాహాలకు విముఖత చూపుతోంది. గణాంకాల ప్రకారం 18-34ఏళ్ల మధ్య వయసున్న పురుషుల్లో 70శాతం బ్యాచిలర్సే. మహిళల్లో ఈ పర్సంటేజ్ 60గా ఉంది. వీరంతా అపోజిట్ సెక్స్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేరట. ఇక అవివాహితుల్లో తాము వర్జిన్ అని 42శాతం పురుషులు, 44.2 శాతం అతివలు పేర్కొన్నారు. ఈ డీటెయిల్సే జపాన్‌ను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.

వివాహాలు చేసుకుని పిల్లల్ని కన్నవారికి జపాన్ అనేక తాయిలాలు ఇస్తోంది. అయినా, పెళ్లిపై జనాలు మెట్టుదిగడంలేదు. తమకు తగ్గవాళ్లు దొరకకపోవడం వల్లే వివాహానికి దూరంగా ఉంటున్నామని బ్యాచిలర్స్ అంటున్నారు. బ్రహ్మచర్యం కొనసాగించమని ఎదో టైమ్‌లో పెళ్లి చేసుకుంటామని ప్రభుత్వం కుదుటపడే మాట చెప్తున్నా.. ఆ శుభగడియ ఇప్పుడే కాదంటున్నారు.  పెళ్లిపై యువత ఆశయాలు-వాస్తవానికి మధ్య గ్యాప్‌ వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్‌లో జననాల శాతం 1.4శాతంగా ఉంది. ఈ శాతాన్ని 2025నాటికి 1.8కి చేర్చేందుకు ప్రభుత్వం తిప్పలు పడుతోంది. కానీ జనాలేమో పెళ్లెప్పుడు చేసుకుంటామో తమకే తెలీదని చెప్తున్నారు. ఈ ప్రాబ్లమ్‌ను అధిగమించి టెక్ కంట్రీ యూత్‌ఫుల్‌గా ఎప్పుడు మారుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు