నాయుళ్ళ సినిమా సూపర్‌ హిట్టేనట

నాయుళ్ళ సినిమా సూపర్‌ హిట్టేనట

టైటిల్‌ చూసి షాకయ్యారా? పాలిటిక్స్‌లో ఉండే వీళ్లు.. మూవీల్లోకి ఎప్పుడు జంప్‌ చేశారా అని అనుకుంటున్నారా? కంగారు పడకండి! వాళ్లు పాలిటిక్స్‌లోనే మూవీలు చేస్తున్నారని ఫైర్‌ అయిపోతున్నారు కామ్రెడ్లు! నిన్న మొన్నటి వరకు ఏపీని కుదిపేసిన ప్రత్యేక హోదా విషయంపై ప్రజెంట్‌ కొంత పీస్‌ ఫుల్‌ వాతావరణమే కనిపిస్తున్నా.. సీపీఎంకు చెందిన కామ్రెడ్లు మాత్రం దీనిని ఇంకా విడిచిపెట్టలేదనిపిస్తోంది. నాలుగు రోజుల కిందట కేంద్ర మంత్రి వెంకయ్యకు విజయవాడ లో భారీ ఎత్తున సన్మానం జరిగిన విషయం గుర్తిందికదా. దానిని టార్గెట్‌ చేసిన కామ్రెడ్లు.. వెంకయ్యను విజయవాడకు రానిచ్చేదిలేదని ఆందోళనకు దిగారు.

ఇక, ఎప్పట్లాగే పోలీసులు ఎంటర్‌ అయిపోవడం, కామ్రెడ్లను అరెస్టు చేయడం జరిగిపోయింది. ఆ వెంటనే భారీ శోభాయాత్రతో కమలదళం  వెంకయ్యను గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు తీసుకువచ్చి.. భారీ ఎత్తున సన్మానించింది. అయితే, బిరుదు గట్రా ఏమీ ఇవ్వలేదనుకోండి! దీనిని టార్గెట్‌ చేసిన కామ్రెడ్‌  సీపీఎం కార్యదర్శి కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయుళ్లను(కేంద్ర మంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబు) పెట్టి సినిమా తీస్తే.. సూపర్‌ డూపర్‌ హిట్టవుతుందని అన్నారు.

వీరిద్దరూ తొడుదొంగలుగా మారారని,అందువల్ల వీరిద్దరిని పెట్టి సినిమా తీస్తే బాగుంటుందని, బాగా ఆడుతుందని విమర్శించారు. అదే సమయంలో బీజేపీ ప్రత్యేక హోదా మూవీ అట్టర్‌ ప్లాప్‌ అయిందన్నారు. అయినప్పటికీ ఏ మొహం పెట్టుకుని వెంకయ్యనాయుడు సన్మానం చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేని పిరికి పందలు అంటూ ఓ రేంజ్‌లో కామెంట్లు కుమ్మేశారు కామ్రెడ్‌! అంతటితో ఆగకుండా.. ఫ్యూచర్‌లో బీజేపీ, టీడీపీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని శాపాలు పెట్టారు. ఏదేమైనా ప్రత్యేక హోదా విషయాన్ని కామ్రెడ్లు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేరు.

Also Read:

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు