రూపాయి ముచ్చట్లు

రూపాయి ముచ్చట్లు

మన రూపాయిని డాలర్, యూరోలతో పోల్చుకుంటూ అవే గొప్ప కరెన్సీలని అనుకుంటాం. వాటి స్థానానికి మన మారక విలువ ఎప్పుడు చేరుతుందో అని లెక్కలు వేసే వారికీ కొదువలేదు. అయితే అగ్రరాజ్యాలను పక్కన పెట్టి ఇతర దేశాల కరెన్సీని మన నోట్లను బేరీజు వేస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. కొన్ని దేశాల కరెన్సీ కంటే మన రూపాయి విలువ అధికంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇరాన్ లో మన రూపాయి విలువ అక్కడి రియల్ కు సుమారు రూ.469తో సమానం. ఈ లెక్కన మన రూ.1000 నోటు ఆ దేశంలో రూ.4.69లక్షలు అన్నమాట. ఇలా మన రుపీ వాల్యూ ఎక్కువగా ఉన్న పలు కరెన్సీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి.

బెలారస్ కరెన్సీ రుబ్లి. ఒక రూపాయి 323రుబ్లిలకు సమానం. వియాత్నం డాంగ్ 334, కోస్టారికా కలోన్స్ 8, పరాగ్వే గురానీ 84, కంబోడియా రీల్ 59, మంగోలియా తుగ్రిక్ 29 రుపీస్ కు ఈక్వల్. హంగరీ ఫారింట్ 4, ఇండోనేషియా రూపియా 198, శ్రీలంక కరెన్సీ శ్రీలంకన్ రూపీ 2, పాకిస్తాన్ రూపీ 1.5, ఉగాండా షిల్లింగ్ 50, చిలియన్ పెసో 10, కొలంబియన్ పెసో 42, లావోస్ కిప్ కు 121, మడగాస్కర్ అరియారీ 45, సైరియన్ పౌండ్ 3 రూపాయిలతో సమానం.
 
జపాన్, కెన్యా, ఇరాక్, నైజీరియా, బంగ్లాదేశ్, జమైకా, అంగోలా, లెబనాన్, కజకిస్తాన్, బురుండీ, సొమాలియా, బర్మా, లైబీరియా, మారిషస్, రువాండాలతో పాటూ ఇంకా అనేక దేశాల కరెన్సీ కంటే మన రూపాయి విలువే అధికం. అందుకే చాలా మంది భారతీయులు ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు