విస్కీ దిగుమతుల్లో టాప్-3లో మనం

విస్కీ దిగుమతుల్లో టాప్-3లో మనం

అభివృద్ధి సంగతేమో గానీ విస్కీ దిగుమతుల్లో మనం టాప్-3లో ఉన్నాం. విస్కీ ఇంపోర్ట్స్ లో భారత్ అగ్రరాజ్యాలు ఫ్రాన్స్-అమెరికాల తర్వాతి స్థానాన్ని అలంకరించింది. స్కాట్ విస్కీ దిగుమతుల శాతం ఒక్కసారిగా 28కి చేరింది. మొత్తంగా 43మిలియన్ పౌండ్ల విలువైన విస్కీ బాటిల్స్ భారత్ కు చేరాయి. ఈ అంశం స్కాచ్ విస్కీ అసోసియేషన్(ఎస్ డబ్ల్యూ ఏ) విడుదల చేసిన నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. 2013 నుంచి స్కాచ్ విస్కీ విదేశీ ఎగుమతుల శాతం గణనీయంగా పెరిగింది.

భారత్ దిగుమతుల వల్లే ఎక్స్ పోర్ట్స్ పర్సెంట్ పెరిగిపోయిందని స్కాచ్ విస్కీ యాజమాన్యం గుర్తించింది. ఫ్రాన్స్, అమెరికాల తర్వాత అత్యధికంగా తమ విస్కీ బాటిల్స్ దిగుమతి చేసుకుంటున్న దేశం ఇండియా అని నివేదిక సైతం విడుదల చేసింది. బ్రిటన్ నుంచి ఎగుమతయ్యే స్కాచ్ విస్కీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. భారత్ తమకు మూడో అతిపెద్ద మార్కెట్ అని ఎస్ డబ్ల్యూ ఏ తెలిపింది. ఫ్రాన్స్ 90.9, అమెరికా 53.1, ఇండియా 41మిలియన్ బాటిల్స్ దిగుమతి చేసుకున్నాయని వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు