వైకాపా బుజ్జగింపులు ఫలించాయ్‌

వైకాపా బుజ్జగింపులు ఫలించాయ్‌

కొన్ని రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉన్న వరంగల్‌ జిల్లాకు చెందిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కొండా మురళీ, సురేఖ జగన్‌ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడా జైలులో కలవబోతున్నార్ట.

అసంతృప్తితో పార్టీని వీడటానికీ కొండా దంపతులు సిద్డపడ్డారని ప్రచారం జరిగినది. దీంతో కొన్ని రోజులనుంచి కొండా దంపతులను బుజ్జగించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి ప్రయత్నాలు మమ్మరం చేశారు. పలువురితో దఫ దఫాలుగా రాయబారాలు పంపి, చివరకు సానుకూల ఫలితం సాధించారు. విజయలక్ష్మితో కొండా దంపతులు భేటీ అయ్యారు. విజయలక్ష్మి సూచనల మేరకు జగన్‌తో ములాఖత్‌లో కలవడానికి సిద్దమవుతున్నారు వారు.

కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు కొండా దంపతులకు గాలం వేయడమూ జరిగింది. ఈలోగా వైకాపా బుజ్జగింపులు ఫలించడంతో కొండా దంపతులు ఆ పార్టీలోనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చార్ట. జగన్‌ని కలిశాక తమ అసంతృప్తి గురించి కొండా దంపతులే ఏం చెప్తారో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు