లైవ్ డిస్కషన్స్ లో మళ్లీ రవిప్రకాష్ మెరుపులు

లైవ్ డిస్కషన్స్ లో మళ్లీ రవిప్రకాష్ మెరుపులు

తెలుగురాష్ట్రాల్లో టీవీ9 ఛానల్ కు ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. ఈ ప్రసారమాధ్యమంలో వచ్చే చర్చాగోష్ఠిలు చాలామందిని ఆకట్టుకుంటుంటాయి. ఇక సీఈఓ రవిప్రకాష్ స్వయంగా సారథ్యం వహించే డిబేట్స్ కు మంచి రేటింగే ఉంటుంది. కొంతకాలంగా లైవ్ డిస్కషన్స్ కు దూరంగా ఉన్న ఆర్పీ మళ్లీ తెరపైకి రావడం ప్రారంభించాడు. అదే ఇంటెన్సిటీతో ప్రోగ్రామ్స్ ను లీడ్ చేస్తున్నాడు. రాజకీయ చర్చల్లో రవిప్రకాష్ దర్శనమివ్వడంతో ఈ తరహా డిస్కషన్స్ ఇష్టపడే ప్రేక్షకులు కాస్త థ్రిల్ ఫీలయ్యారు. లేటెస్ట్ గా ప్రత్యేక హోదా, మల్లన్న సాగర్ పై సాగిన చర్చలను ఇంట్రెస్టింగ్ చూసినట్లు అనేకమంది సోషల్ మీడియాలో మెసేజ్ లు పెట్టారు.

తెలుగు మీడియాలో టీవీ9కు ప్రత్యేకస్థానమే ఉంది. రాష్ట్ర మీడియాలో ఈ ఛానల్ విప్లవమే సృష్టించిందని చెప్తారు కొందరు. మన ఎలక్ట్రానిక్ మీడియాకు దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా రవిప్రకాష్ ను ఆకాశానికెత్తేస్తుంటారు. తాను ఎంచుకున్న పాత్రికేయ రంగం ద్వారా వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించారాయన. అందుకే అభిమానులు ఆయన్ను మీడియా వైతాళికుడిగానూ పేర్కొంటారు.  టీవీ9 లేకముందు రాష్ట్రంలో న్యూస్ ఛానళ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. 2004లో టీవీ9 ఎంట్రీతో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ లో పెనుమార్పులు సంభవించాయి. వార్తలకు వేగం పెరిగింది. మొత్తంగా ఓ మంచి మార్పుకు రవిప్రకాష్ కారణమయ్యారు. సమాజంలో మార్పుకు కారకులైన వారి జాబితాలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ లిస్ట్ లో రవిప్రకాష్ కూడా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English