'మల్లన్న'తో ఫామ్ లోకి రావాలని ప్లాన్!

'మల్లన్న'తో ఫామ్ లోకి రావాలని ప్లాన్!

రాష్ట్రవిభజన దరిమిలా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. ఏపీలో అడ్రస్ లేని పరిస్థితి. తెలంగాణలో విపక్షం హోదాలో ఉన్నా అధికార పార్టీని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతోంది. సీఎం కేసీఆర్ పాలన, ప్రభుత్వ పథకాలను తరచూ ఎండగడుతున్నా ఆశించినంత ప్రజాకర్షణ తెచ్చుకోవడంలో విఫలమవుతోంది.

దీంతో రాష్ట్ర హస్తం వర్గం మల్లన్నసాగర్ ను టార్గెట్ చేసింది. మెదక్ లో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ ను సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ వల్ల రైతులను ఎనలేని అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఆందోళనలు ఉధృతం చేసింది.

మల్లన్నసాగర్ కు వ్యతిరేకంగా ముంపు గ్రామం వేములఘాట్ లో రైతులు దీక్షలు చేస్తున్నారు. వీరి నిరసన ఉద్యమం వంద రోజులు పూర్తిచేసుకుంది. రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూనే కాంగ్రెస్ సర్కార్ విధానాలపై దుమ్మెత్తిపోసింది. మల్లన్నసాగర్ అవసరం రైతులకు లేనే లేదని చెప్తోంది. సీఎం పట్టుదలకు పోవడం మంచిది కాదని.. రైతులకు అన్యాయం చేయొద్దని కోరింది.

ఇదంతా రాష్ట్రంలో పొలిటికల్ గా బలపడేందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న కసరత్తే. మల్లన్నసాగర్ తోనైనా ప్రజల దృష్టిలో మంచి మార్కులు వేయించేసుకుంటే ఆ క్రెడిట్ భవిష్యత్ లో కలిసిసొస్తుందన్నది హస్తం పార్టీ ప్లాన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English