మంత్రి గారిని వెతికిపెట్టండి!

మంత్రి గారిని వెతికిపెట్టండి!

ప్రత్యేక హోదా హీట్ ఏపీని కుదిపేస్తోంది. స్పెషల్ స్టేటస్ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా కేంద్రం ప్యాకేజీలిచ్చి చేతులు దులుపుకోవడంతో ప్రజలు మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ ఆవేదనకు విపక్షాలు జతవడంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై జనాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. హోదా కంటే ప్యాకేజీల ద్వారానే రాష్ట్రానికి గణనీయమైన మేలు చేకూరుతుందని అధికార టీడీపీ నుంచి కూడా హింట్స్ వస్తుండడంతో పలు ప్రాంతాల్లో నిరసనలు ఊపందుకున్నాయి. తిరుపతిలో అయితే వామపక్ష నాయకులు కాస్త వెరైటీగా నిరసన తెలియజేశారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు కనిపించడం లేదంటూ ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీ మంత్రులు కేంద్రాన్ని తగిన రీతిలో ఒత్తిడి చేయలేదని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. వామపక్షాలు కూడా రంగంలోకి దిగి సర్కార్ ను టార్గెట్ చేశాయి. ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన సభలోనూ కేంద్రమంత్రులపై విమర్శలు సంధించారు. మొత్తంగా ప్రత్యేక హోదా అంశం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది.

Also Read:


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English