చంద్రబాబు చెప్తే తీసేస్తారా?

చంద్రబాబు చెప్తే తీసేస్తారా?

కళంకిత మంత్రులు తమ పదవుల్లో కొనసాగడానికి అనర్హులని వారందరిని తొలగించాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరారంట టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు. ఆయన నేతృత్వంలోని తెలుగుదేశం బృందం రాష్ట్ర గవర్నర్‌ని కలిసింది, కళంకిత మంత్రులను తొలగించాలని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది.

గవర్నర్‌ను కలిసిన తర్వాత చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కళంకిత మంత్రులను తొలగించకపోతే, గవర్నరే డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండు చేశారు. సుప్రింకోర్టులో మంత్రులపై ఉన్న కేసులకు ప్రభుత్వ ధనం ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు బాబుగారు. ముఖ్యమంత్రే అవినీతి మంత్రులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సిబిఐ ఛార్జీ సీట్‌ వేశాక, జగన్‌ కేసులో నిందితులుగా ఉన్న మంత్రులు ఎలా ప్రభుత్వంలో కొనసాగుతారని ప్రశ్నించారు చంద్రబాబు. సిబిఐ చేసింది తప్పు అయితే అదే చెప్పాలని, లేకుంటే మంత్రులను తొలగించాలని ఆయన అన్నారు.

గవర్నర్‌ నరసింహన్‌ తెలుగుదేశం బృందం చెప్పినవన్నీ విన్నారే తప్ప ఏమీ మాట్లాడలేదంట. ఏం మాట్లాడతారు? మంత్రులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడమన్న పరిస్థితి ఇప్పుడైతే లేదు. అది చంద్రబాబుకీ తెలియనిది కాదు. బాబుగారు చెప్పారని గవర్నర్‌ మంత్రులను తొలగించరుగాని, ఆ పని చేయాల్సింది కాంగ్రెసు అధిష్టానమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు