ఢిల్లీ టూర్ లో ఏంచేస్థాడు

ఢిల్లీ టూర్ లో ఏంచేస్థాడు

ఢిల్లీ టూర్ లో కేసిఆర్ ఏం చేస్తాడు,  ఏదో చేస్తాడు అంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఒకటే గోల. ఆయన ఇంకా చేసేదేముందో తెలియదు, ఆయన లక్ష్యం తెలంగాణ ఏర్పాటు, అది మొదలుపెట్టాం అంటూ సోనియా దగ్గరి నుంచి పిసిసి బొత్స సత్యనారాయణ వరకు అందరు చెప్పేస్తున్నారు. అయినా సరే కేసిఆర్ డిల్లీ వెళ్లాడు, కాబట్టి ఇంకేదో చేస్తాడు, అంటూ పత్రికలు, చానళ్లలో ఒకటే గోల.

పార్లమెంట్ సమావేశాలు ఉన్నవి మరో అయిదురోజులు, అందులో జరిగే ప్రధానమైన పని ఆహారభద్రతబిల్లు ఆమోదం జరిగిపోయింది తెలంగాణ ఇవ్వద్దు అంటూ సీమాంధ్రుల సభలను స్తంభింప చేస్తున్నారు కాబట్టి, తెలంగాణ ఇవ్వండి అంటూ కేసిఆర్ సభలో గోల చేసేదేమి లేదు. ఇక ఆయన చేసేదేమైనా ఉంటే  ఢిల్లీ బంగ్లాలో హాయిగా సేద తీరడం.
కానీ అసలు విషయం లేదని కాదు. వుంది. అదే టీఆర్ ఎస్ విలీనం సంగతి. అసలు విషయమిదే, ఆయన వెళ్లింది అదుంకే.

తెలంగాణా ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తా అన్న పెద్ద మనిషి కాంగ్రెస్ ఆపని చేయడం ప్రారంభించాక  తోక జాడించడం మొదలుపెట్టాడు, దీంతో తోకను సవరించే పనిలో సోనియా పడింది, విజయశాంతి నుంచి మొదలుపెట్టి ఒక్కో వికెట్ ను రాలగొట్టడం మొదలుపెట్టింది, ఆమె ఈ బౌలింగ్ ఆపలేదనుకో ఆలౌట్ అయి ఫాంహౌజ్ లో ఇక పర్మినెంట్ గా రెస్ట్ తీసుకోవడమే కేసిఆర్ కు మిగిలేది, దీని నుంచి బయటపడేందుకే ఇప్పుడు ఢిల్లీ టూర్ అన్నది అసలు లోగుట్టు అంటున్నారు  రాజకీయపరిశీలకులు. కర్రవిరగకుండా, పాము చావకుండా, అంటే అదే పార్టీని విలీనం కానీకుండా, తన ప్రాధాన్యత తగ్గుకుండా వుండేదుకు కేసిఆర్ ఏం చేస్తారన్నది ఇప్పడు అత్యంత ఆసక్తికరంగామారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు