ఆన్ లైన్లో ‘పైరసీ సినిమాలు’ చూస్తే తప్పు కాదు

ఆన్ లైన్లో  ‘పైరసీ సినిమాలు’ చూస్తే తప్పు కాదు

మీరు చదివింది అక్షరాల నిజం. ఈ మాటను మేం చెప్పటం లేదు. ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యను బొంబాయి హైకోర్టు తాజాగా చెప్పింది. ఆన్ లైన్లో పైరసీ సినిమాలు చూడటం.. డౌన్ లోడ్ చేసుకోవటం ఏమాత్రం తప్పు కాదని.. ఆన్ లైన్లో పైరసీ చూసే వాళ్లు శిక్షార్హులంటూ చెబుతున్నక్లాజ్ సరిగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. గత నెలలో ఆన్ లైన్లో పైరసీ ప్రింట్లను చూసిన వారు శిక్షార్హులంటూ ఐఎస్పీలు ప్రకటించటంతో పలువురు షాక్ తిన్న పరిస్థితి.

ఆన్ లైన్లో పైరసీ సినిమాలు చూసినా.. డౌన్ లోడ్ చేసినా శిక్షలు తప్పవన్న మాట పలువురు పైరసీ ప్రియులకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఇదే సమయంలో బొంబాయి హైకోర్టు స్పందిస్తూ.. ఆన్ లైన్లో పైరసీ సినిమాలు చూడటం తప్పు కాదని.. కాపీరైట్ యాక్ట్ కింద పైరసీ సినిమాల్ని చూసే వాళ్లను శిక్షించాలన్న క్లాజ్ సరిగా లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

దీనికి బదులుగా వెబ్ సైట్ల యూఆర్ఎల్లో రూల్స్ ను ఫాలో కాని వారిని బ్లాక్ చేస్తామన్న సమాచారాన్ని ఉంచాలని పేర్కొంది. అంతేకాదు.. పైరసీ వీడియోల్ని అప్ లోడ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంది. పైరసీ ప్రింట్లను అందుబాటులో ఉంచుతున్న సైట్లను బ్లాక్ చేసి ఎర్రర్ మెసేజ్ ఫోటోను ఉంచాలని చెప్పటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు