ధర్మ సంకటంలో పవన్

ధర్మ సంకటంలో పవన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి స‌భ జ‌రిగి వారం కావ‌స్తున్న‌ప్ప‌టికీ దానిపై చ‌ర్చ సాగుతున్న‌ట్లే....మ‌రో నాల్రోజులు ఉన్న కాకినాడ స‌భ‌పై ముంద‌స్తు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ అటు ప‌వ‌న్‌  అభిమానుల ముందు ఒకే సందేహం ఉంది. అదే ఈనెల 9న కాకినాడలో జ‌రిగే జనసేన సభలో ప‌వ‌ర్ స్టార్ ఏం మాట్లాడుతారు అనే ఆస‌క్తి. గత రెండున్నరేళ్ళుగా ప్రత్యేక హోదా అంశం నానుతూనే ఉంది. అయితే తిరుపతి సభలో పవన్‌ పై కేంద్రాన్ని నిలదీశారు. అధికారపక్షాల్తో పాటు ప్రతిపక్షాలు దీన్ని ప్రస్తావిస్తున్నా కేంద్రం నుంచి కనీసస్థాయిలో కూడా స్పందన రాలేదు. కానీ పవన్‌ ప్రశ్నించే సరికి కేంద్రంలో కదలికొచ్చింది.

అయితే ప్ర‌త్యేక‌ హోదా ఇచ్చే అవకాశాల్లేవని ఇప్పటికే కేంద్రం పరోక్షంగా తేల్చేసింది. హోదా బదులు రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీ మాత్రం ప్రకటించే అవకాశాలున్నాయని తేలిపోయింది. మ‌రి ఈ దశలో హోదాయే లక్ష్యంగా మూడంచెల పోరాటానికి కాకినాడలో శ్రీకారం చుట్టనున్న పవన్‌ తన శ్రేణులకు ఏమని పిలుపునిస్తారు.? హోదాపైనే పట్టుబడతారా లేక రాజకీయ లక్ష్యాలకనుగుణంగా ప్రసంగాన్ని మారుస్తారా ? వచ్చే ఎన్నికలకు సంబంధించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారా అన్న విషయాల్లో ఇంకా స్పష్టతరావడంలేదు. ఇక హోదాపై ఉద్యమాలు చేసినా...ప్రసంగాలు చేసినా ప్రయోజనం లేదని తేలిపోయింది. అసలు హోదా అన్న అంశాన్నే పూర్తిగా రద్దు చేయాలని కూడా కేంద్రం తలపోస్తోంది. ఇప్పటికే హోదా అనుభవిస్తున్న 11రాష్ట్రాలకు కూడా హోదాను రద్దు చేసి దాని ద్వారా కలుగుతున్న ప్రయోజనాల్ని మాత్రం కొనసాగించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ దశలో అసలు మనుగడ కొల్పోతున్న హోదా అంశంపై ఉద్యమాన్ని కొనసాగిస్తారా లేక మరేదైనా అంశాన్ని ప్రస్తావిస్తారా అన్న చ‌ర్చోపచ‌ర్చ‌లు అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English