జగన్‌ బ్యాచ్‌ కు 'తుని విధ్వంసం ' షాక్‌?

జగన్‌ బ్యాచ్‌ కు 'తుని విధ్వంసం ' షాక్‌?

కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఆ మధ్యన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా రగులుకున్న భావోద్వేగంతో తుని పట్టణం అట్టుడికిపోవటమే కాదు.. రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ ను కాల్చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ గొడవలన్నీ కూడా ఆందోళనకారులు చేయలేదని.. వారి పేరుతో కొన్ని సంఘ విద్రోహక శక్తులు చేసినట్లుగా ఏపీ అధికారపక్ష నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని అరెస్ట్‌ లు గతంలో చోటు చేసుకున్నాయి.

తుని విధ్వంసంలోనూ.. రత్నాచల్‌ ఎక్స్‌ ఫ్రెస్‌ ను దగ్థం చేసిన ఉదంతంలోపలువురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. కొందరిని అరెస్ట్‌ చేశారు. దీనిపై తీవ్రంగా రియాక్ట్‌ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆయన దీక్షతో మారిన పరిస్థితులకు తగ్గట్లు అరెస్ట్‌ అయిన నిందితులకు బెయిల్‌ ఇచ్చి విడుదల చేశారు.

ఇదిలా ఉండగా.. తుని విధ్వంసం కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ తాజాగా 20 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత.. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి.. నం.1 న్యూస్‌ ఛానల్‌ అధినేత సుధాకర్‌ నాయుడితో సహా మరో 20 మందికి సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన విచారణను గుంటూరు.. రాజమహేంద్రవరంలోని సీఐడీ కార్యాలయాల్లో చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా నోటీసులు అందుకున్న వారిలో జగన్‌ పార్టీకి చెందిన వారున్నట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు