ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి

ముఖ్యమంత్రికి పబ్లిసిటీ పిచ్చి

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వివిధ పధకాల పేరుతో తనకు తాను ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనకు ప్రచార పిచ్చి పట్టిందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కిరణ్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మహస్తం, అరకొర హస్తంగా ఉందని, మొడి హస్తమని, కమిషన్ల కోసం, తమ గురించి పబ్లిసిటీ చేసుకోవడానికి పెట్టుకున్న కక్కుర్తి హస్తం అని కిషన్‌ రెడ్డి అభివర్ణించారు.

అమ్మహస్తం కార్యక్రమంలో ఇస్తున్న సరుకులు సగం ధరకే బిజెపి సరఫరా చేయగలదన్నారు కిషన్‌రెడ్డి. పాలనలో తనదైన ముద్ర వేయడానికి కిరణ్‌రెడ్డి చాలా కష్టాలు పడుతున్నారు వివిధ పథకాలను ప్రవేశ పెట్టడం ద్వారా. కాని అవేవీ సత్ఫలితాలు ఇవ్వడంలేదు సరికదా, మంత్రి వర్గంలోని వారే వాటిని తప్పు పట్టే పరిస్థితి ఉన్నది. ప్రచారం విషయంలో మాత్రం కిరణ్‌రెడ్డి ఇప్పటివరకూ ముఖ్యమంత్రులుగా పనిచేసినవారికన్నా రెండాకులు ఎక్కువే చదివినట్లుగా వ్యవహరిస్తున్నారు. పబ్లిసిటీ పిచ్చి అనడమెంతవరకు సబబోగాని, పబ్లిసిటీ కోసం కిరణ్‌ చాలా పాట్లు పడుతున్నారనేది నిస్సందేహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు