నిజం! ట్యూష‌న్ల‌తో రూ.477 కోట్లు సంపాదించిన నారాయ‌ణ‌

నిజం! ట్యూష‌న్ల‌తో రూ.477 కోట్లు సంపాదించిన నారాయ‌ణ‌

ట్యూషన్‌ చెప్పడం ద్వారా ఎంత సంపాదిస్తాం చెప్పండి?  వేలల్లో ఉంటుంది. మహా అయితే లక్షలు. కోచింగ్‌ సెంటర్‌ ఉంటే అది లక్షల నుంచి కోట్లకు చేరుతుందేమో. కానీ వందల కోట్లకు అయితే చేరదు కదా?  కానీ చేరింది. ఏకంగా 477 కోట్ల అధికారిక ఆదాయం ఇదే కారణంగా కనిపించింది. ఏపీ పురపాలక శాఖా మంత్రి నారాయణ ఇదే విషయాన్ని లెక్కల్లో చూపించారు. దీనిపై రేగిన వివాదానికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు మరి.

కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ తన ఎన్నికల అఫిడవిట్‌లో చూపించిన రూ.477 కోట్ల ఆస్తిని ఎలా సంపాదించారో చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణకు సంబంధించిన విద్యాసంస్థలను సొసైటీ కింద రిజిస్టర్‌ చేసి నడుపుతున్నారని, లాభాపేక్ష లేకుండా నడిపే ఈ సొసైటీ ఆదాయాన్ని మంత్రి నారాయణ సొంత ఆస్తిలా వాడేసుకున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. పదిహేను రోజుల్లోగా మంత్రి నారాయణ తనకు సమాధానం ఇవ్వకపోతే చట్టపరంగా తాను చేయాల్సింది చేస్తానన్నారు.

దీనిపై నారాయణ స్పందించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. 1979 నుంచి తాను ట్యూషన్లు చెబుతున్నానని పేర్కొన్నారు. తనకు దేశవ్యాప్తంగా కోచింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. విద్యా సంస్థల ద్వారా వచ్చే సంపాదనకు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి కష్టపడి పనిచేస్తున్నానని పేర్కొన్నారు. కేవలం దురుద్దేశం పూర్వకంగా ఈ ఆరోపణలు చేశారని నారాయణ వాపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు