ట్రంప్‌ గెలవాలని ఐసిస్‌ ప్రార్థనలు!

ట్రంప్‌ గెలవాలని ఐసిస్‌ ప్రార్థనలు!

అవును మీరు సరిగ్గానే చదివారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అందులో ముఖ్యంగా ముస్లింలపై విరుచుకుపడే డొనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించాలని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు కోరుకుంటున్నారు. ఇది ఎవరో చేసిన విశ్లేషణ కానేకాదు. సాక్షాత్తు ఐసిస్‌ మీడియా సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రార్థనల వెనుక వారి ట్విస్ట్‌ కూడా ఉందనుకోండి.

పలువురు ఉగ్రవాదుల ఇంటర్వ్యూలు ప్రసారం చేసిన ఐసిస్‌ మీడియా సంస్థ ప్రకారం ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు కోరుకుంటున్నారు. ట్రంప్‌ అధ్యక్షుడైతే అమెరికా తనంతట తానుగా పతనమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ నిలకడలేని మనిషని, చంచల స్వభావంతో ఆయన తీసుకునే దూకుడు నిర్ణయాలు అమెరికాను బలహీనపరుస్తాయని వారు పేర్కొంటున్నారు. ముస్లింలను తీవ్రంగా ద్వేషించే ట్రంప్‌ వారికి వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంటాడని, తద్వారా ముస్లిం సమాజం మొత్తం ఏకతాటిపైకి వసుందని, అది తమకు ఉపయోగపడుతుందని ఐసిస్‌ తీవ్రవాదులు భావిస్తున్నారు. అలా జరిగినప్పుడు ముస్లిం సమాజం, ముస్లిం వ్యతిరేక సమాజం అంటూ ప్రపంచం రెండుగా చీలుతుందని జోస్యం చెప్పారు.

ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతుందని తద్వారా తమకు మరింత మద్దతు దొరుకుతుందని ఐసిస్‌ ఉగ్రవాదులు ఆ ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. అందుకే ట్రంప్‌ గెలవాలని వారు కోరుతున్నారు. మరో అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఇంత వరకు ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదని, దీంతో ఆమె తమకు పూర్తి వ్యతిరేకంగా పని చేసే అవకాశం లేదని ఉగ్రవాదులు పేర్కొనడం విశేషం. అందుకే ట్రంప్‌ను అమెరికన్లు గెలిపిస్తారని ఆశిస్తున్నామని, ట్రంప్‌ను గెలిపించాలని ప్రార్థిస్తున్నామని పలువురు పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు