అమెరికాలో ఆ అమ్మ రియల్ ‘శివగామి’

అమెరికాలో ఆ అమ్మ రియల్ ‘శివగామి’

తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి మాత్రమే. ఈ సినిమాలో బాహుబలిని కాపాడే క్రమంలో శివగామి (రమ్యకృష్ణ పాత్ర) క్యారెక్టర్ మనసులో అలా నిలిచిపోతుంది. జలహోరులో తాను కొట్టుకుపోతున్నా.. బిడ్డను కాపాడేందుకు తన ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. ఇది సినిమాలో కనిపించే పాత్ర. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. రీల్ లో కనిపించిన గ్రాఫిక్స్ కు భిన్నంగా రియల్ లైఫ్ లో ఆ తల్లి చేసిన సాహసం ఇప్పుడందరిని కదిలించేస్తుంది. అమెరికాకు చెందిన ఈ రియల్ ‘శివగామి’ వివరాల్లోకి వెళితే..

33 ఏళ్ల చెల్సీ రస్సెల్ కొలరాడో ప్రాంతానికి చెందిన మహిళ. లాయర్ గా పని చేసే ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి యూటా పావెల్ లేక్ లో నౌకా విహారానికి వెళ్లారు. వారు బోటులో వెళుతుండగా చెల్సీ కుమారుడు ప్రమాదవశాత్తు నీళ్లలోకి జారి పడిపోయాడు. దీంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులంతా ఉండిన క్షణంలో.. మరే మాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకేసింది. పిల్లాడిని దొరకబుచ్చుకొని కాపాడింది. చేతికి దొరికిన పిల్లాడిని ఛాతీ మీద పెట్టుకొని పిల్లాడి తల నీటి పైకి వచ్చేలా చేసింది. తాను మునుగుతున్నా.. పిల్లాడికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడింది.
వేగంగా వెళ్లిన బోటు.. జరిగిన ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి వచ్చేసరికి.. ఆమె మునిగిపోతున్నా పిల్లాడికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా ప్రయత్నించింది. బోటులో వెనక్కి వచ్చిన ఛెల్సీ కుటుంబ సభ్యులు పిల్లాడ్ని పైకి లాగి.. ఆమెను నీళ్లలో నుంచి బోటులోకి తీసుకొచ్చారు. పిల్లాడు క్షేమంగానే ఉన్నా.. నీటిలో ఊపిరి ఆడని ఛెల్సీ మాత్రం ప్రాణాలు విడిచింది. నౌకా విహారంలో లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణం చేయటమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. కొడుకు కోసం తల్లి చేసిన ఈ త్యాగం.. పలువురికి శివగామిని గుర్తుకు తెచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English