సోనియా రక్షించగలరా?

సోనియా రక్షించగలరా?

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు గురించి వస్తున్న ఊహాగానాలకు త్వరలో తెర పడుతుందని మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు రఘువీరారెడ్డి. అనంతరం కాంగ్రెస్‌కు మంచి జరుగుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గాడి లో పెట్టాలని ఎఐసిసి అదినేత్రి సోనియాగాంధీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పార్టీని రక్షించుకోవాలన్న సంకల్పం ఆమెలో ఉందని అన్నారు. రక్షించాలనే ఆలోచన సోనియా చేస్తున్నారనంటే దానర్థం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని రఘువీరా భావిస్తున్నట్టే కదా. మంత్రి రఘువీరారారెడ్డి ఢిల్లీలో సోనియాగాందీని కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై తన అబిప్రాయాలను చెప్పార్ట. రఘువీరారెడ్డి, కాంగ్రెసులో చిరంజీవి గ్రూపు నాయకుడిగా మారారు. చిరు 2014 ఎన్నికలలో సిఎం అభ్యర్థి అని కొందరు అంటుండగా, చిరుతో మంతనాలు జరుపుతూ రఘువీరా కొత్త అనుమానాలకు తెరలేపారు.

ఆయన సోనియాని కలవడంతో రాష్ట్ర కాంగ్రెసులో ఏం జరుగనుందో ఎవరికీ అర్థం కావడంలేదట. ఏదేమైనా రఘువీరా చెప్పినట్లు కాంగ్రెసు పార్టీని రక్షించాలనే సోనియా సంకల్పం ధృఢమైతే ఆ పార్టీకి మంచిదే. కాని కళంకిత మంత్రులను ఏమీ చేయలేకపోతున్న సోనియా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ గురించి ఆలోచన చేస్తున్నారని ఊహించలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు