మంత్రి వెనుక మంత్రి

మంత్రి వెనుక మంత్రి

అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి జైలులో రిమాండు ఖైదీగా ఉండాల్సి వస్తున్నది. జగన్‌ కేసులోనే అరెస్టయి మోపిదేవి వెంకటరమణ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో సెటిలైపోయారు. జగన్‌కిగాని, మోపిదేవికిగాని బెయిల్‌ రాలేదు ఇప్పటిదాకా. జగన్‌ అంటే కాంగ్రెసు ప్రత్యర్థి. పాపం మోపిదేవికే బెయిలు రావడంలేదు. పోని చట్టం పని తాను చేసుకుపోతుంది అనడానికైనా మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారం అడ్డొస్తున్నది. మోపిదేవిలాగనే ధర్మాన ప్రసాదరావుపైనా సిబిఐ అభియోగాలు మోపింది. ఆయన అరెస్టు కాలేదు సరికదా, కోర్టుకు వెళ్ళి వస్తున్నారంతే.

ఆయనలానే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కోర్టుకు వెళ్ళి రావలసి ఉంటుంది ఇకపై. జగన్‌ ఆస్తుల కేసులో ఇటీవల సిబిఐ దాఖలు చేసిన చార్జ్‌ షీట్‌లో సబితా ఇంద్రారెడ్డిని నిందితురాలిగా చేర్చింది. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ చేయగా, వాటి ప్రకారం జూన్‌ 7న ఆమె న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంటుంది. ఓ మంత్రి మాజీ మంత్రి అయ్యారు. ఆ మంత్రి వెనక ఇంకో మంత్రి ఆరోపణలు ఎదుర్కొన్నా జైలుకు వెళ్ళలేదు. ఇంకో మంత్రి, పైగా హోంమంత్రికేమో ఇప్పుడు సమన్లు. ఇంకెందరు మంత్రులు 'క్యూ'లో ఉన్నారో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు