అలాంటి దమ్ము టాలీవుడ్‌ లో ఏ యాక్టర్‌ కు ఉంది

అలాంటి దమ్ము టాలీవుడ్‌ లో ఏ యాక్టర్‌ కు ఉంది

తెర మీద చెలగిపోతూ డైలాగులు వల్లిస్తూ.. హీరో ఫోజులు కొట్టే వారంతా రియల్‌ లైఫ్‌ లో ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం.. 'బాబు' పులకరించిపోతూ.. భజనపరులను పక్కన పెట్టుకు తిరిగే వారు.. సమాజంలోజరిగే ఏ అన్యాయం మీదన పెదవి విప్పరు. ఎవరో ఎక్కడో ఏదో చేసే తప్పుల్ని తప్పుపడుతూ ఉండటమేనా స్టార్ట్స్‌ పని అంటూ చిరాకు పడిపోవచ్చు. నిజానికి అందులోనూ పాయింట్‌ ఉందనుకుందాం. కానీ.. నిత్యం తాను సైతం సమస్యలు ఎదుర్కొవటమే కాదు.. లక్షలాది మంది ప్రజలు పడే కష్టం మీదనైనా నిజాయితీగా ఒక్కరంటే ఒక్క టాలీవుడ్‌ హీరో రియాక్ట్‌ అవుతారా? అన్న ప్రశ్న వేసుకుంటే నో అంటే నో అన్న మాటే వినిపిస్తుంది.

కానీ.. తాజాగా ఒక మలయాళ నటుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన కళ్ల ముందు జరిగిన ఒక ప్రమాదానికి కదిలిపోయిన అతగాడు.. ప్రభుత్వానికి చురుకు పుట్టేలా ఒక వీడియోను రూపొందించటం.. దాన్ని పోస్ట్‌ చేయటంతో ప్రభుత్వం సైతం రియాక్ట్‌ కావాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం మలయాళ నటుడు జయసూర్య  కేరళలో తన కార్లో వెళుతున్న వేళ.. రోడ్ల మీద ఏర్పడిన గుంతల కారణంగా బైక్‌ మీద వెళుతున్న వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రోడ్లను నిర్వహించే సర్కారు తీరుపై విమర్శలు చేస్తూ ఒక సెల్ఫీ వీడియో తీశాడు. పన్నులు కట్టేవారు గుంతల్లో పడి గాయపడుతున్నారని.. రోడ్లను పట్టించుకునే నాథుడే లేడంటూ.. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ప్రభుత్వం ఉండేది ఎందుకంటూ నిలదీయటమే  కాదు.. తాను చూసిన యాక్సిడెంట్‌ గురించి చెప్పుకొచ్చారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో వైరల్‌ గా మారటమే కాదు.. లక్షలాది మంది వీడియోను చూసి.. వేలాది మంది షేర్‌ చేశారు. వైరల్‌ అయిన ఈ వీడియో ముఖ్యమంత్రి విజయన్‌ కు చేరింది. వెంటనే స్పందించిన ఆయన నటుడు జయసూర్యకు సమాధానం పంపుతూ.. తమ ప్రభుత్వం రోడ్ల రిపేర్లకు కట్టుబడి ఉందని.. రవాణా సౌకర్యాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెడుతుందని వెల్లడించారు. ఒకవేళ అదే మాట నిజమైతే.. అన్ని గుంతలు రోడ్ల మీద ఎందుకు ఉన్నట్లు? ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నట్లు? నిజానికి ఇలాంటి పరిస్థితే హైదరాబాద్‌ మహానగరంలోనూ ఉంది. కానీ.. ఒక్కరంటే ఒక్క టాలీవుడ్‌ ప్రముఖుడు సైతం స్పందించనే స్పందించరు ఎందుకని..? మన హీరోలంతా ముఖానికి రంగేసుకున్నప్పుడే హీరోలా..?

ഞങ്ങളുടെ ബഹുമാനപ്പെട്ട "മുഖ്യമന്ത്രി " അറിയുവാനായ്...

Posted by Jayasurya on Monday, August 8, 2016

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు