ఈసారి మైండ్‌ బ్లాక్‌ చేస్తుందట

ఈసారి మైండ్‌ బ్లాక్‌ చేస్తుందట

పోయిన చోటే వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తనను ఏ జీవో అయితే ముప్పతిప్పలు పెట్టిందో.. అదే జీవోతో తిరుగులేని శక్తిగా అవతరించటంతో పాటు..రాజకీయంగా తమను ఇరుకున పెట్టాలని భావించిన రాజకీయ పక్షాలకు మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ప్లాన్‌ చేసినట్లు చెబుతున్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ ముంపు బాధితల పరిహారం కోసం విడుదల చేసిన జీవో నెంబరు 123తో కేసీఆర్‌ సర్కారు ఎన్ని ఇబ్బందులు పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ జీవోతో రాజకీయంగా.. కోర్టు పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నసర్కారు.. తాజాగా ఈ జీవోకు కొన్ని మార్పులు చేర్పులు చేసింది. కోర్టుల సూచనలతో పాటు.. తర్వాతి కాలంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఉండేలా జీవోకు మార్పులు చేర్పులు చేసింది.

తొలుత విడుదల చేసిన జీవోలో ఉన్న లోపాల్ని సరిదిద్దటంతో పాటు.. మరింత ఆకర్షణీయంగా ప్యాకేజీలు సిద్ధం చేయటం.. పరిహారానికి సంబంధించి ప్రభుత్వం అందించే సాయంపై ఎవరూ నోరు మెదపలేని విధంగా తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు అధికారికంగా విడుదల చేసే ఈ జీవోకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. వాటి వివరాలు చూస్తే.. జీవో 123తో తాను ఏమైతే పోగొట్టుకున్నానో.. అవన్నీ వడ్డీతో సహా తిరిగి వచ్చేలా తెలంగాణ సర్కారు ప్లాన్‌ చేసినట్లుగా కనిపిస్తోంది.

మార్పులు చేసిన జీవో 123ను చూస్తే..

- నిర్వాసితులకు రూ.5.04లక్షలతో డబుల్‌ బెడ్రూం ఇల్లు. సింగిల్‌ గా ఉండే వారికి ఇంటి కోసం రూ.1.25లక్షలు.

- నిర్వాసితులయ్యే ప్రతి కుటుంబానికి పరిహారం

- చేతివృత్తులు.. సంప్రదాయ వృత్తుల మీద ఆధారపడి బతికే వారికి వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ కింద భారీ ఎత్తున పరిహారం

- ప్రాజెక్టుల కోసం భూములు కొనుగోళ్లకు ముందు ప్రాథమిక నోటిఫికేషన్‌.. నిర్వాసితులతో సంప్రదింపులు జరపటం.

- భూముల కొనుగోళ్ల కోసం జిల్లా కలెక్టర్‌ ఛైర్మన్‌ గా కొనుగోళ్ల కమిటీ ఏర్పాటు

- అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే భూముల ధరల ఖరారు.

- స్వచ్ఛందంగా భూములు అమ్మటానికి వచ్చేవారి భూములకు సంబంధించిన వివరాల్ని సేకరించి.. ప్రొక్యూరింగ్‌ ఏజెన్సీకి తెలియజేసి ప్రక్రియ పూర్తి చేయటం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు