ఆదాయంలో కేసీఆర్‌ను మించిన చంద్ర‌బాబు

ఆదాయంలో కేసీఆర్‌ను మించిన చంద్ర‌బాబు

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడిన రాష్ట్రం ఏపీ. అదేస‌మ‌యంలో ఖ‌జానా నిండుగా క‌ళ‌క‌ళ లాడిన రాష్ట్రం తెలంగాణ‌. అంటే ఆదాయంలో ఏపీని తెలంగాణ డామినేట్ చేసింద‌న్న‌మాట‌. అయితే, ఇప్పుడు బండి రివ‌ర్స‌యింది! స్వ‌ల్ప తేడాతో ఏపీ.. తెలంగాణ‌ని డామినేట్ చేసేసింది. తాజా వాణిజ్య ప‌న్నుల ఆదాయ లెక్కల్లో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఇప్పుడు తెలంగాణ అధికారులు కేసీఆర్‌తో ఎక్క‌డ చీవాట్లు తినాల్సి వ‌స్తుందోన‌ని తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటో చూద్దాం. 2016-17 వాణిజ్య ప‌న్నుల ఆదాయానికి సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్ మాసాల లెక్క‌ల‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలూ వెల్ల‌డించాయి. దీంతో ఆయా లెక్క‌ల ఆధారంగా ఏ రాష్ట్రం ఆదాయంలో ముందుంది? ఏ రాష్ట్రం వెనుక‌బ‌డింది? అనే అంశాల ఆధారంగా వాణిజ్య ప‌న్నుల విభాగం ర్యాంకులు ప్ర‌క‌టించింది.

 జార్ఖండ్ భారీ ఆదాయంతో 1వ స్థానం, యువ సీఎం అఖిలేష్ పాలిత ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ 2వ స్థానంలో నిలిచాయి. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆదాయం లేద‌ని తెగ ఫీలైపోతున్న ఏపీ స్పీడ్‌గా దూసుకెళ్లి.. 3వ స్థానంలో నిలిచింది. మ‌రోప‌క్క‌, ఆదాయం బాగుంద‌ని, బాగా వ‌స్తుంద‌ని లెక్క‌లేసుకున్న తెలంగాణ ఒక్క‌సారిగా కుదేలై.. ఏపీ త‌ర్వాత నాలుగో స్థానానికి ప‌రిమితమైంది. దీంతో తెలంగాణ అధికారులు అవాక్క‌వుతున్నారు. తాజాగా శ‌నివారం వెల్ల‌డించి ఈ వివ‌రాల‌పై ఇప్పుడు ఏపీలో సంతోషం వ్య‌క్తమ‌వుతుండ‌గా, తెలంగాణ‌లో మాత్రం సీఎం స‌హా ఆర్థిక మంత్రి సంబంధిత అధికారులపై ఫైరైపోతున్న‌ట్టు స‌మాచారం. వాణ‌జ్య ప‌న్నుల వ‌సూళ్ల‌లో ఏపీ 14.64% వృద్ధి నమోదు చేయగా, తెలంగాణ 14.55% వృద్ధిని నమోదు చేసింది.

 రెండు రాష్ట్రాల వృద్ధిల‌లోనూ తేడా 0.09% స్వ‌ల్ప తేడానే అయిన‌ప్ప‌టికీ.. ఏపీ.. తెలంగాణ‌ను వెన‌క్కి నెట్టింది. దీంతో కేసీఆర్ ఈ విష‌యంపై తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. రానున్న మూడు మాసాల్లో ఏపీ మ‌రింత పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న అంటున్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఏపీని అధిగ‌మించేలా ప‌క్కా ప్లాన్ వేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించార‌ని తెలిసింది. ఏదేమైనా.. వాణిజ్య ప‌న్నుల వ‌సూళ్ల‌లో ఏపీ ఊహించ‌ని విధంగా దూసుకుపోవ‌డం సీఎం చంద్ర‌బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే, ఆయ‌న చెబుతున్న దాని ప్ర‌కారం ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసేనాటికి.. ఏపీ దేశంలోనే తొలిస్థానంలో ఉండాలి. మ‌రి అధికారులు ఆదిశ‌గా ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English