'5' తో ఏపీని బీట్ చేసిన తెలంగాణ

'5' తో ఏపీని బీట్ చేసిన తెలంగాణ

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఎంత ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పరీక్షల నిర్వాహణ మొదలు.. ఫలితాల వెల్లడి వరకూ పోటాపోటీ వాతావరణ రెండు తెలుగురాష్ట్రాల మధ్యన ఉంది. తాజాగా అంతర్జాతీయ పెట్టుబడుల అనుకూల వాతావరణం కోసం అమలు చేసే విధానాలను అనుసరించి మార్కుల్ని కేటాయించే 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకుల్లో ఏపీని తెలంగాణ రాష్ట్రం బీట్ చేసింది. నిజానికి ఈ అంశం మీదనే రెండు రాష్ట్రాల మధ్యన పంచాయితీ నడిచింది. తమ విధానాల్ని ఏపీ కాపీ కొట్టిందంటూ కేంద్రానిక తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది కూడా.

ఇక.. తాజాగా వెలువరించిన ర్యాంకుల విషయానికి ఏపీ కంటే తెలంగాణ 5 పాయింట్ల చిల్లర అధిక్యంలో ఉండి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలవగా.. రెండో స్థానంలో ఏపీ నిలిచింది. 2015లో విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానంలో నిలవగా.. తెలంగాణ 13వ ర్యాంకులో ఉండగా.. ఈసారి ఏకంగా ఫస్ట్ ర్యాంకును సాధించటం గమనార్హం.ఈ ఏడాది జూన్ లో  ప్రాధమికంగా విడుదల చేసిన ఫలితాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలవగా.. ఏపీ 19వ స్థానానికి పడిపోయింది. దీంతో ఏపీ సర్కారుకు దిమ్మ తిరిగి పోయిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తమ సైట్ లో పెట్టిన వివరాల్ని ఏపీ సర్కారు కాపీ చేసిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య గొడవకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. తుది ర్యాంక్ ను తేల్చేందుకు గడువు జులై ఏడు వరకూ పొడిగించటంతో ఏపీ తన సమాచారాన్ని అప్ లోడ్ చేసింది. తాజాగా ప్రకటించిన స్కోర్స్ విషయానికి వస్తే.. 60.24 శాతం స్కోర్ తో తెలంగాణ మొదటిస్థానంలో నిలవగా.. 55.75 శాతం స్కోర్ తో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో 13వ స్థానం నుంచి ఒకటోస్థానానికి తెలంగాణ ఎదగటం అభినందనీయమనే చెప్పాలి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైందని చెప్పాలి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English