ప్లిప్‌కార్ట్‌ 600 మందికి షాక్‌ ఇచ్చింది

ప్లిప్‌కార్ట్‌ 600 మందికి షాక్‌ ఇచ్చింది

దేశంలో అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సేవల ద్వారా ఎంతో మంది మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ తన సొంత ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఏకంగా  600 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థాగత కారణాలను ప్రస్తావిస్తూ తీసుకున్న ఈ నిర?యం ఇపుడు కలకలం స ష్టిస్తోంది. గతంతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్‌ 5-6 బిలియన్‌ డాలర్ల విలువను కోల్పోయింది. దీంతో ఉద్యోగాల తొలగింపునకు పాల్పడుతుతోందని విమర్శలు వస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌కు మొత్తం 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో తాజాగా 600 మందికి ఆ సంస్థ టాటా చెప్పేసింది. ఈ వార్త కలకలం సృష్టించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి స్పందించారు. పనితీరు సరిగా లేని ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఇది ప్రతి ఏడాది జరిగేదేనని, పనితీరు సరిగా లేని 1-2 శాతం ఉద్యోగులను తొలగిస్తుంటామని ఆయన చెప్పారు. ప్రతి కంపెనీలోనూ ఇది జరుగుతుందని, తమ ప్రత్యర్థి ఈ-కామర్స్‌ సంస్థల్లోనూ ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని తెలిపారు. గత తొమ్మిదేళ్లుగా ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఫ్లిప్‌కార్ట్‌.. కంపెనీని మళ్లీ గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో 6 బిలియన్ల నష్టాలు ఎదుర్కొంది. అయితే నష్టాలకు, ఉద్యోగుల తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదని ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.