ఈ హీరోలు మోసపోయారు

ఈ హీరోలు మోసపోయారు

తెలుగు పరిశ్రమలో కొన్ని చప్పిడి ముఖాలు కూడా హీరోలుగా వెలిగిపోతున్న మాట వాస్తవమే. ఐతే వాళ్లకు బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి చెల్లిపోతోంది. మామూలుగా అయితే సినిమా హీరో కావాలంటే కొన్ని ఫీచర్స్ ఉండాలి. అంతో ఇంతో గ్లామర్ లేకుండా ఇక్కడ అవకాశాలు పొందడం కష్టం. హీరో ఫ్రెండు పాత్రకు కూడా గ్లామర్ ఉండాలని ఆశించే ఇండస్ట్రీ మనది. అలాంటిది హీరో వేషాల కోసమైతే చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు కుర్రాళ్లకు హీరోలుగా అవకాశమిస్తా అని ఓ దర్శకుడు అంటే నమ్మేశారట. నమ్మేసి లక్షలు లక్షలు సమర్పించుకున్నారట. తీరా ఆ సినిమా తీస్తానన్న దర్శకుడు బోర్డు తిప్పేసి తమ డబ్బులతో ఉడాయిస్తే లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు ఈ కుర్రాళ్లు. ఇంతకీ మేటర్ ఏంటంటే..

నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రాజేంద్రనాయక్ అలియాస్ డి.వి.సిద్దార్థ్ కొన్ని నెలల కిందటే హైదరాబాద్ ఫిలిం నగర్లోని అపోలో హాస్పిటల్ రోడ్డులో ‘ఓం సాయిరాం ప్రొడక్షన్స్’ పేరుతో ఓ ఆఫీస్ తెరిచాడు. ఆ ఆఫీస్ పేరుతో పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాడు. జూన్ 19న ‘ప్రేమ+స్నేహం=సంగీతం’ పేరుతో ఓ సినిమా తీయబోతున్నామని.. హీరోలుగా చేయాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఆఫీస్‌లో సంప్రదించాలని అందులో పేర్కొన్నాడు. దీంతో కొందరు కుర్రాళ్లు ఆశగా అక్కడికి వెళ్లారు. ఐతే సినిమా నిర్మాణం కోసం డబ్బులు అవసరమని.. అవి సమకూరిస్తే బాండు రాసిస్తానని.. సినిమా విడుదలయ్యాక తిరిగి చెల్లిస్తానని చెప్పాడు సిద్దార్థ్. అతడి మాయ మాటల్ని నమ్మి చాలామంది డబ్బులు సమర్పించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతానికి చెందని శ్రావణ్‌కుమార్‌ గౌడ్ అయితే తన అక్క పెళ్లి కోసం ఇంట్లో దాచిన రూ.4 లక్షలు తెచ్చి ఇచ్చేశాడు. మిగతా కుర్రాళ్లు కూడా తమ వల్ల అయినంత డబ్బులు తెచ్చారు. ఐతే డబ్బులన్నీ తీసుకున్నా జూన్ 19న అనుకున్న ప్రకారం సినిమా మొదలుపెట్టలేదు సిద్ధార్థ్. వారం కిందట ఆఫీస్ మూసేసి ఉడాయించాడు. దీంతో ఈ కుర్రాళ్లందరూ బంజారాహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు