ముసుగు తొలగిస్తున్న కాంగ్రెస్

ముసుగు తొలగిస్తున్న కాంగ్రెస్

తెలంగాణా రాష్ట్ర శిల్ప సౌందర్యాన్ని కాంగ్రెస్ తాను అనుకున్నట్లే రూపొందించి జనం కళ్లముందు పెట్టడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తాను అనుకున్న దారి దిశగా ఇరుప్రాంతాల నేతలను నడుపుతోందని గడచిన కొన్ని రోజులుగా వినవస్తున్న వార్తలు ఇప్పడిప్పుడే నిజమై కూర్చుంటున్నాయి. కాంగ్రెస్ చేయాలనుకున్నది ఒకటి, చేసింది మరొకటి అని మొదట్నించీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఇంకేదో వుంది, అదేంటో తెలియడం లేదని ఇన్నాళ్లూ కిందమీదాపడుతూ వస్తున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు, అటు రాజకీయనాయకులు కూడా. బుర్ర పట్టుకున్నారు, ఇస్తుందా..ఇవ్వందా..డ్రామానా..అయితే ఏమయి వుంటుంది అని..ఇలా రకరకాలుగా.

ఆఖరికి తరచు వెనక్కు వెళ్లేది లేదని దిగ్గూబాబు చెప్పినపుడు కూడా. హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణా వారిదే అని చెప్పినపుడు కూడా ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. తెరాసను చీల్చే ప్రయత్నాలు చేస్తుంటే ఎందుకిలా..అనుకున్నారంతా? పోనీ టీఆర్ఎస్ ను దారికి తెచ్చుకోవడానికి అనుకుంటే, మరి సీమాంధ్రను వదిలేసుకుందా అన్న అనుమానం వచ్చింది.

కానీ వీటన్నింటి్కీ ఇప్పుడిప్పుడే సమాధానాలు దొరుకుతున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణా ఎంపీలు, మంత్రులతో ఆంటోని కమిటీ సమావేశమై, సంధించిన ప్రశ్నలు పరిశీలిస్తుంటే, అసలు సంగతి వెల్లడవుతోంది. కాంగ్రెస్ తాను అనుకున్న దాన్ని ముందుగా బయటపెట్టకుండా, ఇరు వర్గాలను ఆ దారి దిశగా మళ్లించే పని చేస్తోందని స్పష్టమవుతోంది. పిట్ట తగవు, పిట్ట తగవు పిల్లి తీర్చిన చందంగా, వాళ్లకి రాష్ట్రం కావాలి, వీళ్లకి హైదరాబాద్ కావాలి. తమకి కనీసం మళ్లీ ముఫై  పై చిలుకు ఎంపీలు కావాలి..ఇదీ కాంగ్రెస్ స్ట్రాటజీగా అర్థమవుతోంది.

సీమాంధ్రుల అవకాశాలకు, బతుకులకు ఎలా రక్షణ ఇస్తారని జవాబు లేని ప్రశ్నను సంధించడం, మేం చెప్పినదానికి అంగీకరిస్తారా అని ముందరకాళ్లకు బంధం వేయడం గమనిస్తే, కాంగ్రెస్ మెలమెల్లగా ఇరువర్గాల దారిని మళ్లిస్తున్నట్లు కనిపిస్తోంది. రాయల తెలంగాణాను మళ్ల మరోసారి తెరపైకి తేవడం వెనుక కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది. వాళ్లకిష్టం లేనిది తెరపైకి తెచ్చి, మళ్లీ వారి కోరిక మేరకే వదిలేసామన్నంత బిల్డప్ ఇవ్వడం, తద్వారా తను అనుకున్న దారిలోకి వారిని తెచ్చే వ్వూహం.

ఇక సీమాంధ్ర ఉద్యమం ఆగడం లేదా ఆపడం నాయకుల చేతిలో లేదు. అది పులిమీద స్వారీ వ్యవహారం. అందుకు ఏదో ఒక అంశంలో విజయం..కావాలంటే మరో అంశంలో రాజీ అవసరం. అదే హైదరాబాద్.  దీని ప్రకారమే యుటి ప్రతిపాదన. తలలేని తెలంగాణా వారికి. కొత్త తల వచ్చే రాష్ట్రం వారికి. హైదరాబాద్ తమ పాలన లోకి. ఈ దిశగా ఇరు పక్షాలు వచ్చేవరకు కాంగ్రెస్ ఆంథోనీ కమిటీ అనే సాగదీత నాటకం సాగుతూనే వుంటుంది.

ఇలా చేయడం ద్వారా ఇరు వైపులా జనం ముందుకు వెళ్లే అవకాశం కాంగ్రెస్ కు వుండనే వుంటుంది. టీఆర్ఎస్ ను బలహీనపరిచాం. వైఎస్ పేరు చెప్పి జగన్ పార్టీని దెబ్బతీసాం. తేదేపా సంగతి సరే సరి. మరి ముఫై ఎంపీ సీట్లు రాలక చస్తాయా?

అంతేనా దిగ్గూబాబూ..మీ పథక పయనం?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English