త‌న వివరాలు గూగుల్లో ఎతుక్కోమ‌న్న కిల్ల‌ర్‌!

త‌న వివరాలు గూగుల్లో ఎతుక్కోమ‌న్న కిల్ల‌ర్‌!

అతనో కిల్లర్‌... కానీ బ్యాంకు దొంగతనం కేసులో పోలీసులకు దొరికాడు. ఈ క్రమంలో సహజంగానే పోలీసులు ఇంటారేగషన్‌ చేస్తుండగా వారికి షాక్‌ ఇచ్చాడు. ''నన్ను విచారించొద్దు.. నా గురించి గూగుల్‌లో వెతకండి.. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది'' అని పోలీసులకు సూచన ఇచ్చిన ఆ సీరియల్‌ కిల్లర్‌ ఉదంతం వారికి షాక్‌ ఇచ్చింది.

లాలూ ప్రసాద్‌ సారథ్యంలోని ఆర్జేడీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ లల్లాన్‌ శ్రీవాత్సవ్‌ను 2002లో దారుణంగా కాల్చిచంపారు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని అతని తనయుడు అవినాష్‌ శ్రీవాత్సవ్‌(35) సీరియల్‌ కిల్లర్‌గా మారాడు. బాలీవుడ్‌ మూవీ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌-2'ను ఆదర్శంగా తీసుకుని తన తండ్రిని హత్య చేసిన పప్పు ఖాన్‌ను మట్టుబెట్టాడు. ఖాన్‌ చనిపోయినప్పటికీ 32 బుల్లెట్లను అతని శరీరంపై కాల్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. బీహార్‌ వ్యాప్తంగా 20 మందిని హత్య చేసిన శ్రీవాత్సవ్‌ వైశాలి జిల్లాలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చోరికి యత్నిస్తుండగా పోలీసులకు దొరికిపోయాడు.

ఈ సందర్భంగా పోలీసులు అతనిని విచారిస్తున్నారు. 'నన్ను విచారించి.. నా సమయాన్ని, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సైకో కిల్లర్‌ అమిత్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ చేయండి. నా గురించి మీకే తెలుస్తుంది' అని పోలీసులకు సూచించాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉండగా...శ్రీవాత్సవ్‌ విద్యావంతుడు. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో పని చేశారు. తన తండ్రి హత్యను జీర్ణించుకోలేని అవినాష్‌ కిల్లర్‌గా మారాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు