మాజీ సీఎంకు భారీగా గండిప‌డింది

మాజీ సీఎంకు భారీగా గండిప‌డింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పరువు భంగం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిరణ్‌ను నమ్ముకునే బదులు సొంత దారి చూసుకోవడం మేలని ఆయన అనుచరులు భావిస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్య అనుచరుడు, ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరపున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నరేష్‌ కుమార్‌రెడ్డి పచ్చ కండువా కప్పుకొన్నారు. విజయవాడలోని చంద్రబాబు నివాసానికి పలువురు కార్యకర్తలతో కలిసి వచ్చిన నరేష్‌కుమార్‌ రెడ్డి తెలుగుదేశం చేరారు. నరేష్‌కుమార్‌తో పాటు వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ అవృద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకే టీడీపీలో చేరినట్లు నరేష్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు అంతా సహకరించాలని నరేష్‌కుమార్‌ కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు