హైదరాబాద్‌పై కొత్త సంకేతాలు!

హైదరాబాద్‌పై కొత్త సంకేతాలు!

హైదరాబాద్‌ స్టేటస్‌ మారనుంది. అది బహుశా ఎలాంటి కొత్త హోదాను/ రూపాన్ని సంతరించుకుంటుందో ఇంకా స్పష్టత లేదుగానీ.. మొత్తానికి హోదా మారుతుందన్నది మాత్రం స్పష్టం. కావూరి సాంబశివరావు లేవనెత్తిన ఈ అంశం తాజాగా అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ వారు మాత్రం హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటూ భీష్మించుకున్న ప్రకటనలే గుప్పిస్తున్నారు. అదే సమయంలో సమైక్య వాదులు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే అంటున్నారు. అయితే సమైక్య వాదుల వద్ద మాత్రం కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. చిరంజీవి హైదరాబాదును యూటీ చేయాల్సిందేనని చాలా రోజులుగా అంటూనే ఉన్నారు. అయితే ఆయన అంటున్నా దానికి పెద్ద సంచలన స్పందన మాత్రం దక్కలేదు. అదే చాలాకాలంగా మౌన ముద్ర పాటిస్తున్న మరో సీనియర్‌ నాయకుడు కావూరి సాంబశివరావు పెదవివిప్పి.. హైదరాబాదును యూటీగా గానీ, మరో రాష్ట్రంగా గానీ చేసినప్పుడు మాత్రమే అందరికీ ఇక్కడ సుస్థిరమైన వాటా, రక్షణ ఉంటుందనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన తర్వాత.. సంచలనం రేగుతోంది.

హైదరాబాదు విషయంలో ఇదివరకు అనుకున్నట్లుగా.. తెలంగాణకు మాత్రమే రాజధాని అనే హోదా నుంచి భాగ్యనగరం ఏదో ఒక అదనపు హోదాకు ప్రమోట్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వాదనలకు మద్దతు చేకూర్చే విధంగా.. మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. ఆంటోనీ కమిటీని సోమవారం సాయంత్రం కలిసిన తెలంగాణ ప్రాంత మంత్రులతో కమిటీ పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాదు విషయంలో మేం ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారా? అని ఆంటోనీ కమిటీ వారిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అలాగే రాయల తెలంగాణ అనే ప్రదిపాదన కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే తెలంగాణలో కొంత రగడ చెలరేగే అవకాశం ఉన్నప్పటికీ.. అన్ని ప్రాంతాల్లోనూ కొంత అసంతృప్తితో అందరూ సర్దుకుని.. రాష్ట్ర విభజనను ఆమోదించడం అంటే.. కావూరి ప్రాతిపాదనతో మాత్రమే సాధ్యం అని పలువురు భావిస్తున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English