ఓయూలో సీన్‌ రివర్స్‌ అయింది

ఓయూలో సీన్‌ రివర్స్‌ అయింది

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఇపుడు మరో రూపంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణకు నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని గొంతెత్తి పోరాడిన ఆ యూనివర్సిటీ ఇన్నాళ్లు ఉపకులపతి లేక సతమతం అవుతుండగా.. ఎట్టకేలకు వీసీని ఎంపిక చేస్తే దానిపై హైకోర్టు ఫైరయింది. దీంతో ఓయూ అంటే కలకలానికి మారుపేరుగా కనిపిస్తోంది.

యూనివర్సిటీ పర్యవేక్షణలో వైస్‌చాన్స్‌లర్‌ కీలకం. ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో ఇంతటి కీలక పదవి  వీసీ పోస్టు మూడేండ్ల నుంచి ఖాళీగా ఉన్నది. 2013 జూన్‌ 14న ప్రొఫెసర్‌ సత్యనారాయణ వీసీ బాధ్యతల్లోంచి రిటైరయ్యారు. ఆ తర్వాత ఇన్‌చార్జి వీసీగా ఐఏఎస్‌ అధికారి వికాస్‌రాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ కావడంతో ఏడాదిన్నర కిందట ప్రభుత్వ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్యను ఓయూ ఇన్‌చార్జి వీసీగా నియమించారు. ఆమె ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కసారి కూడా ఓయూ వైపు కన్నెత్తి చూడలేదని విద్యార్థులు తప్పుపట్టారు. రెగ్యులర్‌ వీసీ కోసం ప్రభుత్వం సెర్చ్‌ కమిటీ కూడా వేసింది. ప్రొఫెసర్లు, ఐఏఎస్‌ అధికారుల నుంచి దరఖాస్తులూ స్వీకరించారు. కమిటీ వేసి నెలలు గడుస్తున్నా భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఎట్టకేలకు తెలంగాణలోని వివిధ వర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓయూ వీసీగా రామచంద్రంను ఖరారు చేసింది. అయితే వెంటనే దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓయూనే కాకుండా మొత్తం వీసీల నియామకంపై న్యాయస్థానం సీరియస్‌ అయింది. కేసు పెండింగ్‌లో ఉండగా వీసీలను ఎలా నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. వీసీల నియామకం విషయంలో రెండేళ్లు ఆగిన ప్రభుత్వం ప్రభుత్వం 2, 3 రోజులు ఆగలేదా అని దర్మాసనం నిలదీసింది. ఈ తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. దీంతో కేసీఆర్‌ సర్కారు ముందడుగు వేసినప్పటికీ తిరిగి సమీక్షించుకోవాల్సి వచ్చింది. తద్వారా వీసీ వచ్చారనే సంతోషం కాస్తా ఓయూలో రివర్సైంది.

ఇదిలాఉండగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 56 విభాగాలున్నాయి. ఆర్ట్స్‌ విభాగంలో 18, సైన్స్‌ 14, ఇంజనీరింగ్‌ ఏడు, ఫార్మసీలో ఒకటి, సోషల్‌ సైన్సెస్‌లో 8, ఎంబీఏలో రెండు, లా విభాగంలో ఒకటి, ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌లో ఆరు విభాగాలున్నాయి. ఈ విభాగాల కొనసాగింపునకు ప్రొఫెసర్ల పాత్ర కీలకం. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి డిపార్టుమెంట్‌లో ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ అమలు కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు