ఇట్లు.. మీ విశ్వాసపాత్రుడు సురేశ్‌ ప్రభు

ఇట్లు.. మీ విశ్వాసపాత్రుడు సురేశ్‌ ప్రభు

రాజకీయాల్లో అందరూ దొంగలు, విశ్వాసఘాతకులే ఉండరు. తాము పొందే లబ్ధికి తగ్గట్లుగా రుణం తీర్చుకునేవారు కూడా ఉంటారు. ఇప్పుడు ఏపీలో సీఎం చంద్రబాబుకు అలాంటి విశ్వాసపాత్రుడైనే నేత దొరికారు. విశ్వాసపాత్రుడైన నేత అంటే ఆయనదే టీడీపీలో చంద్రబాబు అధ్యక్షత కింద పనిచేస్తున్న నాయకుడు కాదు... కేంద్ర మంత్రి. అవును.. కేంద్ర మంత్రి, బీజేపీ నేత సురేశ్‌ ప్రభు ఇప్పుడు చంద్రబాబుకు ఫ్యాన్‌ గా మారిపోయారు. కేంద్రంలో రైల్వే మంత్రిత్వ శాఖ చూస్తున్న ప్రభు ఇప్పుడు చంద్రబాబు ఏమడిగితే దానికి ఓకే అంటున్నారు. ఏపీ ఏమడిగినా అడ్డం తిరుగుతున్న కేంద్రంలో ఉంటూనే రైల్వే మంత్రి మాత్రం ఇలా వరాలు కురిపించడం వెనుక కారణం చాలా క్లియర్‌ గా ఉంది. ఆయన తనకు చంద్రబాబు చేసిన మేలుకు ఫిదా అయి ఇలా హెల్పు చేసేస్తున్నారు.  ఏపీ నుంచి టీడీపీ కోటాలో టీడీపీ బలంతో సురేశ్‌ ప్రభును రాజ్యసభకు పంపించారు చంద్రబాబు. దీంతో సురేశ్‌ ప్రభు ఫుల్‌ ఖుష్‌ అయ్యి ఏపీలో రైల్వేల అభివృద్ధికి వరాలు కురిపిస్తున్నారు.

అంతేకాదు.. రైల్వే ప్రాజెక్టులను నడిపించడంలో ఏపీ దూసుకెళ్తోందంటూ ప్రభు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం చాలా డైనమిక్‌గా ఉందని.. . పెండింగ్‌ రైల్వే ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడం తోపాటు కొత్త్త ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసర మైన నిధులు సమీకరించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ముందుంది.. ఈ విధానంలో ద్వారా మిగి లిన రాష్ట్రాల కన్నా ముందుగా కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకుంది, ఇదే జోరు కొనసాగిస్తే రెండేళ్లలో ఏపీ ప్రభుత్వం రైల్వే అభివృద్ధిలో అగ్రభాగాన నిల వడం ఖాయమని  ప్రభు చెబుతున్నారు.  పోర్టు, రైలు మార్గాలు రవాణా రంగంలో పెద్ద సాధనాలని.. ఈ రెండు కలిసి పనిచేస్తే ఇక అభివృద్ధికి తిరుగుండదని చెప్పారు. ఏపీలో చంద్రబాబు నాయుడు పోర్టులను కూడా అభివృద్ధి చేస్తున్నారని.. రైల్వేల పరంగా తమ సహకారం ఉంటుందని చెప్పారు.  రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రా జె క్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో కలసి ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కాగా ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తరువాత ఏపీలో రైల్వేల అభివృద్ధి పెరిగింది. చంద్రబాబు కోరిన రైళ్లను వేశారు. కొత్త ప్రాజెక్టులేవీ ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినా పాత ప్రాజెక్టులను వేగవంతం చేశారు. తరచూ ప్రభు ఏపీకి వస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా అక్కడ ప్రభుతో భేటీ ఖచ్చితంగా జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన వ్యక్తయినా కూడా సురేశ్‌ ప్రభు ఇప్పుడు ఏపీ ఎంపీగా మన రాష్ట్రాన్ని సొంత రాష్ట్రంగానే భావిస్తూ సహకరిస్తుండడం గొప్ప విషయమే.  మొత్తానికి చంద్రబాబు ఇచ్చిన ఒక్క రాజ్యసభ సీటు ఏపీ రైల్వేల ఫేటు మారుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు