పార్లమెంటు సాగేది సందేహమే..

పార్లమెంటు సాగేది సందేహమే..

మూడురోజుల విరామం తర్వాత మొదలుకానున్న పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేది సందేహమేనని చెప్పొచ్చు. ఓ పక్క ఆహారబిల్లును ఆమోదించుకొని ఆగస్టు 20నాటికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించాలన్న సోనియమ్మ ఆశ నెరవేరే సూచనలు కనిపించటం లేదు. తన భర్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆహారభద్రత పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆమె ఎంతగా తపిస్తున్న అది సాకారమయ్యే సూచనలు మాత్రం కనిపించటం లేదు. ఇంతపెద్ద దేశాన్ని ఏలే సోనియమ్మ తన కలల పంట అయిన పథకాన్ని తాను అనుకున్న రోజున ప్రారంభమయ్యేలా చేసుకోలేకపోతున్నారా? అంటే అవుననే చెప్పాలి.

రాష్ట్రాన్ని ఏకపక్షంగా ముక్కలు చేసిన ఆమెకు.. టీడీపీ సీమాంధ్ర నాయకుల సెగ తగులుతోంది.ఇప్పటికే నాలుగురోజుల పాటు.. తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సభవాయిదా పడుతూ వస్తోంది. నామమాత్రం ఉన్న సభ్యులను కూడా అధికారపక్షం ఎందుకు నిలువరించలేకపోతుందన్న సందేహం ఎవరికైనా వస్తుంది.కానీ.. విషయమంతా అందులోనే ఉంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన పక్షంలో సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న టీడీపీ ఎంపీలు ఎక్కడ హీరోరలు అవుతారోనన్న ఉద్దేశ్యమే వారిపై వేటు పడేలా సోనియమ్మ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.దీనికి తోడు టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకుంటే.. తాము అందులో భాగస్వామ్యం కామని.. బీజేపీ ఇప్పటికే తేల్చి చెప్పింది.

ఈ నేపథ్యంలో సంకటంలో పడిన కాంగ్రెస్ కు ఇప్పుడు దిక్కు తోచటం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ హనుమంతరావు తిరుమలకు వచ్చిన సందర్భంగా.. కొండపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో.. ఆయన కొండ దిగి తిరుపతికి వచ్చిన సందర్భంలో ఆయనపై సమైక్యవాదులు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా ఆయన కారుపై చెప్పులు.,రాళ్లు విసిరారు. కానీ..వీహెచ్ పై దాడి చేశారంటూ హడావుడిగా పోలీసులు అరరెస్టు చేసి.. రిమాండ్ కు కూడా పంపారు. ఈ నేపథ్యంలో.. సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న నేతల అరెస్టు విషయంపై పార్లమెంటులో ప్రస్తావిస్తానని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇప్పటికే సమైక్యావాదులకు మాట ఇచ్చారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీహెచ్ ను వదిలేసి.. ఉద్యమనేతలపై కేసులు పెట్టి.. అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతారా? అంటూ ఇప్పటికే తిరుపతిలో ఆందోళనలు ఊపందుకున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు జరగటం అంతంతమాత్రంగానే చెప్పాలి. ఏదిఏమైనా ఆగస్టు 20న తన భర్త రాజీవ్ గాంధీ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాగైనా ఆహారభిల్లు పార్లమెంటు ఆమోదం పొందాలని సోనియమ్మ డిసైడ్ అయితే మాత్రం టీడీపీ ఎంపీల సస్పెండ్ చేసే అవకాశం ఉంది.  ఇప్పటికే  ఉన్న సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సోనియమ్మ మరో సమస్యను కోరి తెచ్చుకుంటారా? అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు